Gold And Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా కొనసాగుతోన్న వెండి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price: ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఒకానొక సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర...
Gold And Silver Price: ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఒకానొక సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55000కు చేరుకోగా తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా పెరుగుతోన్న ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. * దేశరాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.44,390గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,390 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే ఢిల్లీలో కిలో వెండి రూ.67,500గా ఉంది. * దేశ ఆర్థిర రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.43,290 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,290 వద్ద కొనసాగుతోంది. ఇక ఇక్కడ కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే…
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,240గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,080 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ. 71,800గా ఉంది. * విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 42,240గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,080గా ఉంది. ఇక ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,800 వద్ద కొనసాగుతోంది. * సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.42,240 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,080 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,800గా ఉంది. Also Read: ఈ పనిని 10 రోజుల్లో చేయండి..! లేకపోతే మీ పాన్ కార్డు పనికిరాదు..! 10 వేల వరకు ఫైన్ కూడా పడే ఛాన్స్..!