Maruti Suzuki Ignis: మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఆ కారుపై రూ. 65,000 వరకూ తగ్గింపు.. ఆలస్యం చేయకండి..
వినియోగదారులకు ఇంకా ఆకర్షించేందుకు ప్రత్యేకమైన సేల్స్ ను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ సేల్స్ నిర్వహిస్తోంది. ఈ డిసెంబర్ 31 వరకూ ప్రత్యేకమైన తగ్గింపు ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకీ ఇగ్నిస్ కారుపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఇది ఫంకీ డిజైన్ లో సిటీ డ్రైవ్ కు సరిగ్గా సరిపోయే కారు. ఈ ఇగ్నిస్ కారుపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.

మన దేశంలోని అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్లలో మారుతి సుజుకీ మొదటి స్థానంలో ఉంటుంది. అన్ని వర్గాల వారికి అవసరమైన బడ్జెట్లో ఈ కంపెనీ కార్లు ఉంటాయి. అందుకే అత్యధిక సేల్స్ రాబడుతుంటుంది. అయినప్పటికీ వినియోగదారులకు ఇంకా ఆకర్షించేందుకు ప్రత్యేకమైన సేల్స్ ను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ సేల్స్ నిర్వహిస్తోంది. ఈ డిసెంబర్ 31 వరకూ ప్రత్యేకమైన తగ్గింపు ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకీ ఇగ్నిస్ కారుపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఇది ఫంకీ డిజైన్ లో సిటీ డ్రైవ్ కు సరిగ్గా సరిపోయే కారు. ఈ ఇగ్నిస్ కారుపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
మారుతి సుజుకీ ఇగ్నిస్‌పై డిస్కౌంట్ ఇలా..
మారుతి సుజుకీ ఇగ్నిస్ కారుపై రూ. 65,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. దీనిలో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్ కాగా.. రూ. 15,000 ఎక్స్ చేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ బోనస్ గా ఉంది. అయితే ఆ ఆఫర్ కేవలం 2023, డిసెంబర్ 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ అన్ని చోట్ల ఒకేలా ఉండదు. డీలర్ ను బట్టి, అందుబాటులో ఉన్న స్టాక్, కలర్, వేరియంట్ ను బట్టి మారుతుంటుంది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలంటే మీరు దగ్గరలోని నెక్సా డీలర్ వద్దకు వెళ్లొచ్చు. ఈ ఇగ్నిస్ కారు ప్రారంభ ధర రూ. 5.84లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ కారు టాటా పంచ్, హ్యూందాయ్ ఎక్స్ టర్ లకు పోటీగా మార్కెట్లో కొనసాగుతోంది.
మారుతి సుజుకీ ఇగ్నిస్ స్పెసిఫికేషన్స్..
ఈ కారులో 1.2లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82హెచ్పీ, 113ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఈ ఇంజిన్ పనితీరు బాగుటుంది. మైలేజీ కూడా 20.89కిలోమీటర్ ప్రతి లీటర్ కు ఇస్తుంది.
మారుతి సుజుకీ ఇగ్నిస్ ఫీచర్స్..
ఈ కారు చూడటానికి ఫంకీ డిజైన్లో ఉంటుంది. దీనిలో ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్ స్టార్ట్ , కీ లెస్ ఎంట్రీ, 60:40 స్ల్పిట్ ఫోల్డింగ్ సీట్లు అందుబాటులో ఉంటాయి.
మారుతి సుజుకీ ఇగ్నిస్ ధర, లభ్యత..
ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా వేరియంట్లలో సిగ్మా వేరియంట్ బేస్ వేరియంట్ కాగా.. అల్పా టాప్ వేరియంట్గా ఉంది. ఈ ఇగ్నిస్ కారు ధర రూ. 5.84లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి రూ. 8.30లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఇది టాటా పంచ్, హ్యూందాయ్ ఎక్స్ టర్, నిస్సాన్ మాగ్నైట్, రినాల్ట్ కైగర్ వంటి వాటితో పోటీపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..