AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weapons: ఆయుధ తయారీలో భారత్ మార్క్.. పెరుగుతున్న తయారీ కేంద్రాలు

ఒకప్పుడు రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి రక్షణ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశం ప్రస్తుతం స్వయం సమృద్ధి పొందుతున్న సైనిక శక్తిగా అభివృద్ధి చెందుతోంది. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాల వల్ల దేశంలో ఇప్పుడు దాని సొంత ట్యాంకులు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, ఫిరంగి, జలాంతర్గాములను ఉత్పత్తి చేస్తున్నారు. రక్షణ సామర్థ్యాల్లో భారత వృద్ధిని తెలియజేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Weapons: ఆయుధ తయారీలో భారత్ మార్క్.. పెరుగుతున్న తయారీ కేంద్రాలు
Indian Own Weapons
Nikhil
|

Updated on: Jun 24, 2025 | 4:04 PM

Share

భారతదేశంలో హైదరాబాద్, పూణే, జబల్పూర్, బెంగళూరు, నాగ్‌పూర్ మరియు కొచ్చి వంటి నగరాలు వాటి ఐటీ, పారిశ్రామిక బలానికి మాత్రమే కాకుండా ఆధునిక ఆయుధాల ఉత్పత్తికి కీలక కేంద్రాలుగా కూడా వేగంగా గుర్తింపు పొందుతున్నాయి.  డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి ప్రధాన రక్షణ సంస్థలు, అనేక ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాంతాల్లో తయారీ కేంద్రాలను నెలకొల్పాయి. ఇటీవల బెంగళూరులోని హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన ‘తేజస్’ ఫైటర్ జెట్‌ను భారత వైమానిక దళంలో చేర్చారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్, క్షిపణి లాంచర్లు, స్మార్ట్ రాడార్ వ్యవస్థలు, సూపర్‌సోనిక్ సామర్థ్యాలతో సహా అధునాతన లక్షణాలతో రూపొందించారు. భారతదేశ వైమానిక పోరాట నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడానికి హెచ్ఏఎల్ ఇప్పుడు మరింత అధునాతన వెర్షన్ ‘తేజస్ మార్క్ 2’పై పని చేస్తోంది.

తమిళనాడులోని అవడిలో ఉత్పత్తి చేసిన అర్జున్ ట్యాంక్, పాకిస్తాన్ ట్యాంకుల కంటే యుద్ధంలో అత్యుత్తమమైనదిని పరిగణిస్తున్నారు. అలాగే జబల్పూర్‌లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ ‘ధనుష్’ ఫిరంగిని అభివృద్ధి చేసింది. దీనిని ‘స్వదేశీ బోఫోర్స్’ అని పిలుస్తారు. అలాగే హైదరాబాద్‌లో డీఆర్‌డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంయుక్తంగా ఆకాశ్ మరియు నాగ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆకాశ్ క్షిపణి వాయు రక్షణ కోసం రూపొందించారు. బ్రహ్మోస్ క్షిపణి ప్రారంభంలో భారతదేశం, రష్యా మధ్య జాయింట్ వెంచర్ అయినప్పటికీ ఇప్పుడు దీనిని దేశీయంగా తయారు చేస్తున్నారు.

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక, ఐఎన్ఎస్ విక్రాంత్, కొచ్చిలో నిర్మించారు. అదనంగా విశాఖపట్నంలో నిర్మించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. భారతదేశం సముద్రంలో సూపర్ పవర్‌గా మారుతుందని నిపుణులు చెబతున్నారు. అలాగే చండీగఢ్, కాన్పూర్‌లోని ఆయుధ కర్మాగారాల్లో ఇప్పుడు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, ఏకే-203, కార్బైన్‌ల వంటి చిన్న ఆయుధాలను తయారు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి