Aeroplane Cost: వివిధ రకాల విమానాల ధర ఎంత ఉంటుందో తెలుసా..?
Aeroplane Cost: ప్రయాణికులను తీసుకెళ్లే విమానం ఎంత ఖర్చవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విమానం ధర దాని పరిమాణం, ఉపయోగం వంటి అనేక అంశాలపై ఆధారపడి చాలా తేడా ఉంటుంది. వివిధ నివేదికలు, నిపుణుల అందించిన సమాచారం ప్రకారం వాటి ధర..

నేడు అనేక రకాల విమానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంత మంది ప్రయాణికులను తీసుకెళ్లే విమానం ఎంత ఖర్చవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విమానం ధర దాని పరిమాణం, ఉపయోగం వంటి అనేక అంశాలపై ఆధారపడి చాలా తేడా ఉంటుంది. వివిధ నివేదికలు, నిపుణుల అందించిన సమాచారం ప్రకారం వాటి ధర ఎలా ఉంటుందో చూద్దాం.
గ్లైడర్లు:
సెయిల్ ప్లేన్స్ అని కూడా పిలువబడే గ్లైడర్లు. అత్యంత ఖరీదైన విమానాలలో ఒకటి. వాటి ధర దాదాపు $1,000 నుండి $10,000 వరకు ఉంటుంది. ఉపయోగించిన గ్లైడర్లు ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి. పోటీ గ్లైడర్ల ధర లక్షల డాలర్లు కావచ్చు.
సాధారణ విమానం
సాధారణ విమానాలు సింగిల్-ఇంజిన్ విమానాల నుండి చిన్న మల్టీ-ఇంజిన్ మోడల్‌ల వరకు వివిధ ఎంపికలలో వస్తాయి. అల్ట్రా విమానాల ధర రూ. 30 లక్షల నుండి రూ. 60 లక్షల మధ్య ఉంటుంది. సింగిల్-ఇంజిన్ విమానాల ధర రూ. 2 కోట్ల నుండి రూ. 5 కోట్ల మధ్య ఉంటుంది. ట్విన్-ఇంజిన్ విమానాల ధర రూ. 6 కోట్ల నుండి రూ. 15 కోట్ల మధ్య ఉంటుంది. అలాగే చిన్న ప్రైవేట్ జెట్‌ల ధర రూ. 25 కోట్ల నుండి రూ. 50 కోట్ల మధ్య ఉంటుంది.
ఇది కూడా చదవండి: AC Cooling Tips: మీ కారు ఏసీ కూలింగ్ తగ్గుతోందా? ఈ పొరపాట్లు కావచ్చు.. ఇలా చేయండి
జంబో జెట్
జంబో జెట్ అనేది సుదూర ప్రయాణానికి అనువైన వైడ్-బాడీ విమానం. అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఇవి 300 నుండి 600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. ధర మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. బోయింగ్ 747-8 ఇంటర్‌కాంటినెంటల్ ధర దాదాపు రూ.3,000 కోట్లు. అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్‌బస్ A380 ధర దాదాపు రూ.4,000 కోట్లు, బోయింగ్ 777-9 ధర దాదాపు రూ3,200 కోట్లు.
ఇది కూడా చదవండి: RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




