AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric car: కేక పెట్టించిన కొత్త కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మీ. ధర కూడా అందుబాటులోనే..

ఇండియా మార్కెట్​లో చౌకైన ఎలక్ట్రిక్​ వాహనంగా టాటా టియాగో ఈవీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్​ ఈసీ3 గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Electric car: కేక పెట్టించిన కొత్త కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కి.మీ. ధర కూడా అందుబాటులోనే..
Citroen Ec3
Madhu
|

Updated on: Feb 28, 2023 | 10:45 AM

Share

ఎలక్ట్రిక్ వాహన శ్రేణికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని అందిపుచ్చుకునేందుకు అన్ని దిగ్గజ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈక్రమంలో ఒకదానికి మించి మరొకటి అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త మోడళ్లతో దూసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్లోకి ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ అడుగుపెట్టింది. సిట్రోయెన్ ఈసీ3 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అదిరిపోయే ఫీచర్ల దీని సొంతం. ధర కూడా తక్కువగానే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సూపర్ ఇంటీరియర్..

ఈసీ3 ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ ఆకర్షణీయంగా ఉంది. లోపలి భాగంలో 10 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్2ప్లే, డిజిటైజ్డ్ డ్రైవర్స్ డిస్‌ప్లే, మ్యానువల్ ఏసీ, పవర్ విండోస్, స్టీల్ వీల్స్, వీల్ కవర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీపై ఏడేళ్ల వారంటీ..

ప్రస్తుతం మార్కెట్​లో లాంచ్​ అయిన ఈసీ3.. ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న సిట్రోయెన్​ సీ3 ఐసీఈ ఇంజిన్​ను పోలి ఉంటుంది. ఇక ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఏకంగా 320 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అలాగే ఇందులో డీసీ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. అంటే 57 నిమిషాల్లోనే బ్యాటరీ 80 శాతం ఫుల్ అవుతుంది. పెట్రోల్ ఇంజిన్‌తో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌లో టార్క్ ఎక్కువగా ఉంది. అయితే ఇది ఎక్కువ బరువు ఉంటుంది. అంటే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం కొంత ఆలస్యం అవుతుంది. పెట్రోల్ కారు అయితే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 14.32 సెకన్లలో అందుకుంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 16.88 సెకన్లలో అందుకుంటుంది. అంతేకాకుండా ఈ కారు బ్యాటరీ ప్యాక్‌పై ఏడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ కారులోని మోటార్‌పై ఐదేళ్ల వరకు వారంటీ ఉంటుంది. వెహికల్‌పై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

టాటా టియాగోపై పోటీ..

ఇండియా మార్కెట్​లో చౌకైన ఎలక్ట్రిక్​ వాహనంగా టాటా టియాగో ఈవీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్​ ఈసీ3 గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ ఎక్స్​షోరూం ధరలు రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంటుంది. వాస్తవానికి.. టియాగో ఈవీకి సమీపంలోనే సిట్రోయెన్​ ఈసీ3 ధరలు కూడా ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావించాయి. కానీ టాటా టియాగో ఈవీ కన్నా కాస్త ఎక్కువ ధరతోనే సిట్రోయెన్​ ఈసీ3 లాంచ్​ అయ్యింది.

ధర ఇలా..

ధర విషయానికి వస్తే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 11.5 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. లివ్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఫీల్ వేరియంట్ ధర అయితే రూ. 12.13 లక్షలుగా ఉంది. ఫీల్ వైబ్ వేరియంట్ ధర రూ. 12.28 లక్షలుగా ఉంది. ఇంకా ఫీల్ డ్యూయెల్ టోన్ వైబ్ వేరియంట్ ధర రూ. 12.43 లక్షలుగా ఉంది. అదే పెట్రోల్ కారు ధర రూ. 5.98 లక్షల నుంచి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..