Stock Market: ఈ వారం స్టాక్‌ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి.. బిజినెస్‌ నిపుణులు ఏం చెబుతున్నారు..

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగుతుండగా.. దేశీయ ఇన్వెస్టర్ల సహకారంతో ఈ వారం స్టాక్ మార్కెట్(Stock Market) తిరిగి వైభవాన్ని సంతరించుకుంది...

Stock Market: ఈ వారం స్టాక్‌ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి.. బిజినెస్‌ నిపుణులు ఏం చెబుతున్నారు..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 22, 2022 | 3:06 PM

విదేశీ ఇన్వెస్టర్లు(Foreign Investors) అమ్మకాలు కొనసాగుతుండగా.. దేశీయ ఇన్వెస్టర్ల సహకారంతో ఈ వారం స్టాక్ మార్కెట్(Stock Market) తిరిగి  వైభవాన్ని సంతరించుకుంది. శనివారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్(Petrol), డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.8, రూ.6 తగ్గించింది. సెంటిమెంట్‌కు బలం చేకూర్చే దిశగా ఇదో పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వారు ఈ నెలలో ఇప్పటివరకు 35 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో, వచ్చే వారం మార్కెట్ కదలికలు ఎలా ఉండవచ్చో చూద్దాం.. స్థానిక స్టాక్ మార్కెట్ల దిశను ఈ వారం ప్రపంచ కార్యకలాపాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) పోకడలు నిర్ణయిస్తాయి. ఇది కాకుండా, నెలవారీ డెరివేటివ్ సెటిల్మెంట్ కారణంగా దేశీయ మార్కెట్లలో అస్థిరత ఉండవచ్చని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా మాట్లాడుతూ.. గత కొన్ని సెషన్లలో స్థానిక మార్కెట్లలో చాలా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయని అన్నారు.

ద్రవ్యోల్బణం, గ్లోబల్ ఎకానమీలో మందగమనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ప్రధాన ఆందోళన కలిగించే విషయమని మీనా అన్నారు. దీని కారణంగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) విక్రయిస్తున్నారు. అయితే దేశీయ ఇన్వెస్టర్ల మద్దతు కారణంగా భారత మార్కెట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. గత వారం, 30 షేర్ల BSE సెన్సెక్స్ 1,532.77 పాయింట్లు పెరిగింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 484 పాయింట్లు పెరిగింది. నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల సెటిల్ మెంట్ కారణంగా ఈ వారం దేశీయ మార్కెట్లలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయని ఆయన చెప్పారు. గ్లోబల్ ఫ్రంట్‌లో, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం వివరాలు మే 25 న విడుదల అవుతాయి.

సామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యేషా షా మాట్లాడుతూ, “గత వారం మార్కెట్ అస్థిరంగా ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రస్తుత త్రైమాసిక ఆదాయాల సీజన్ మరియు డెరివేటివ్స్ సెటిల్‌మెంట్ నేపథ్యంలో ఈ వారం ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. FOMC సమావేశం వివరాలు, US GDP అంచనాలు మరియు నిరుద్యోగ గణాంకాలు ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని షా అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…