Pan card: పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా.? ఇంట్లోనే ఇలా మార్చుకోండి..

ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంకింగ్‌ సంబంధిత పనుల కోసం పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేయాలన్నా, రుణం పొందాలన్నా పాన్‌ కార్డ్‌ అనివార్యం. అయితే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్‌ కార్డులో కొన్నిసార్లు పేరు తప్పుగా పడుతుంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న స్పెలింగ్ మిస్టేక్స్‌ ఉంటుంటాయి...

Pan card: పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా.? ఇంట్లోనే ఇలా మార్చుకోండి..
Pan Card
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 24, 2024 | 6:29 PM

ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంకింగ్‌ సంబంధిత పనుల కోసం పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. రూ. 50 వేలకు మించి లావాదేవీలు చేయాలన్నా, రుణం పొందాలన్నా పాన్‌ కార్డ్‌ అనివార్యం. అయితే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్‌ కార్డులో కొన్నిసార్లు పేరు తప్పుగా పడుతుంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న స్పెలింగ్ మిస్టేక్స్‌ ఉంటుంటాయి. వీటిని సరిచేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే కూర్చొని మీ పాన్‌ కార్డులో పేరు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం కరెక్షన్‌ అండ్‌ అప్లికేషన్‌ టైప్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరినీ సెలక్ట్‌ చేసకొని మొత్తం సమాచారాన్ని అందించాలి.

* ఇందులో భాగంగా మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పాన్‌ కార్డ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

* ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే కేవీసీ కోసం ఫిజికల్‌ లేదా డిజిటల్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. డిజిటల్ సెలక్ట్ చేసుకుంటే ఆధార్‌ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయొచ్చు.

* పాన్‌కార్డ్‌ ఈకేవైసీ కోసం ఆధార్ సెలక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీరు వివరాలను మార్చిన పాన్‌ కార్డ్‌ను ఎలా పొందాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవాలి.

* తర్వాత ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను ఎంటర్‌ చేయాలి. చివరిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

* చెల్లింపు పూర్తయిన తర్వాత కంటిన్యూపై నొక్కాలి. వెంటనే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. సదరు ఓటీపీని ఎంటర్‌ చేసి క్లిక్‌ చేస్తే ప్రక్రియ ముగుస్తుంది. నెలరోజుల్లోపూ మీ పాన్‌ కార్డ్‌ మీ అడ్రస్‌కు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!