Credit card: క్రెడిట్ కార్డుపై 16 అంకెలే ఉండడానికి అసలు కారణం ఏంటో తెలుసా.?
వీటిలో ప్రధానమైనవి కార్డు నెంబర్‌తో పాటు సీవీవీ, ఎక్స్పైరీ డేట్. కార్డుపై ఉండే నెంబర్లను గమనిస్తే 16 ఉంటాయి. ఏ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డును గమనించినా 16 నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఇంతకీ క్రెడిట్ కార్డులపై కేవలం 16 నెంబర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం భారీగా జీతాలు వచ్చే వారికి మాత్రమే క్రెడిట్ కార్డులు ఇస్తుండే వారు. కానీ ప్రస్తుతం బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు భారీగా మంజూరవుతున్నాయి. దీంతో ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మంచి ఎక్కువ కార్డులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ కామర్స్ సంస్థలు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వస్తువులపై ప్రత్యేకంగా డిస్కౌంట్ ప్రకటించడం ద్వారా క్రెడిట్ కార్ఢ్ యూజర్లు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే క్రెడిట్ కార్డును గమనిస్తే కొన్ని వివరాలు ఉంటాయి.
వీటిలో ప్రధానమైనవి కార్డు నెంబర్‌తో పాటు సీవీవీ, ఎక్స్పైరీ డేట్. కార్డుపై ఉండే నెంబర్లను గమనిస్తే 16 ఉంటాయి. ఏ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డును గమనించినా 16 నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఇంతకీ క్రెడిట్ కార్డులపై కేవలం 16 నెంబర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రెడిట కార్డులోని మొదటి నెంబర్ సదరు కార్డును జారీ చేసిన సంస్థ ఏంటో చెబుతుంది. ఒకవేళ తొలి సంఖ్య 4 అయితే ఆ కార్డును వీసా జారీ చేసిందని అర్థం. అదే ఫస్ట్ నెంబర్ 5 అయితే మాస్టర్ కార్డు సదరు క్రెడిట్ కార్డును జారీ చేసిందని అర్థం. ఇక 6 అయితే.. సదరు క్రెడిట్ కార్డును రూపే జారీ చేసిందని అర్థం. ఇక క్రెడిట్ కార్డులోని తర్వాత 6 నెంబర్లు సదరు కార్డును ఏ బ్యాంక్ జారీ చేసిందో చెబుతుంది. దీనిని ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (IIN), బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (BIN) అని కూడా పిలుస్తారు.
ఇక 7 నుంచి 15 సంఖ్యలు మీ క్రెడిట్ కార్డుకు సంబంధించి అకౌంట్ ఏంటో తెలియజేస్తుంది. ఈ అకౌంట్ మీకు క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంక్‌ల వద్ద ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డులోని చివరి సంఖ్యను చెక్ డిజిట్‌గా పిలుస్తారు. ఈ కార్డు నకిలీ క్రెడిట్ కార్డుల తయారీకి అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..