Name Change: మీ పేరు మార్చుకోవాలనుకుంటే ఏమి చేయాలో తెలుసుకోండి
తన ఇంటిపేరులో మార్పులు చేయాలనుకుంటే, ఆమె దానిని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాలి. ఆమెకు రెండు అషన్స్ ఉన్నాయి. మొదటిది, ఉదాహరణకు, ఆమె తెలంగాణలో నివసిస్తుంటే, ఆమె ఈ సమాచారాన్ని తెలంగాణ గెజిట్‌లో ప్రచురించవచ్చు. రెండవది, ఈ సమాచారాన్ని ఆమె కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా, పెట్టుబడి, బ్యాంక్, PF, పెన్షన్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లలో రజని తన పేరులో మార్పులు చేయవచ్చు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ కు చెందిన రజని తన ఇంటిపేరును మార్చాలనుకుంటున్నారు. రజనీ లా చాలామంది తమ పేర్లను మార్చుకుంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కొందరు వ్యక్తులు తమ ఇంటిపేరును మాత్రమే మార్చుకోవాలనుకుంటారు. కొంతమంది వ్యక్తులు తమ పూర్తి పేరును మార్చుకోవాలనుకుంటారు. చాలా సార్లు, కొన్ని సర్టిఫికెట్స్ లేదా డాక్యుమెంట్స్ లో తప్పు పేరు రిజిస్టర్ అయి ఉంటె అప్పుడు పేరు మార్చవలసి ఉంటుంది.
రజని తన ఇంటిపేరులో మార్పులు చేయాలనుకుంటే, ఆమె దానిని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాలి. ఆమెకు రెండు అషన్స్ ఉన్నాయి. మొదటిది, ఉదాహరణకు, ఆమె తెలంగాణలో నివసిస్తుంటే, ఆమె ఈ సమాచారాన్ని తెలంగాణ గెజిట్‌లో ప్రచురించవచ్చు. రెండవది, ఈ సమాచారాన్ని ఆమె కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా, పెట్టుబడి, బ్యాంక్, PF, పెన్షన్ మొదలైన వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లలో రజని తన పేరులో మార్పులు చేయవచ్చు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గెజిట్ నోటిఫికేషన్ పొందడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. వీటిలో అఫిడవిట్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అఫిడవిట్‌లో, మీరు మీ పేరు, చిరునామా, వయస్సు వివరాలను ఇవ్వాలి. అలాగే, మీరు మీ పేరును ఎందుకు మార్చుకుంటున్నారో తెలియజేయాలి. భవిష్యత్తులో మీ పేరు ఏమిటి. మీ ఇంతకు ముందు మీ డాక్యుమెంట్స్ ఏ పేరుతో ఉన్నాయో మీరు అఫిడవిట్‌లో పేర్కొనవలసి ఉంటుంది. ఈ అఫిడవిట్ నోటరీ లాయర్ అలాగే ఓత్ కమీషనర్ ద్వారా సర్టిఫై చేయించాలి.
అఫిడవిట్ తర్వాత, గెజిట్ నోటిఫికేషన్ పొందడానికి రెండు న్యూస్ పేపర్స్ లో ఈ విషయాన్ని ప్రకటనగా పబ్లిష్ చేసి ఉండాలి. వీటిలో ఒక వార్తాపత్రిక హిందీ లేదా రాష్ట్ర భాష అలాగే మరొకటి ఇంగ్లీషు అయి ఉండాలి. మీ పేరు మార్పుపై ఎవరికైనా అభ్యంతరం ఉందా లేదా అని చూడడమే దీని ఉద్దేశం. పేరు మార్పు సమాచారం ప్రచురించిన వార్తాపత్రికల అసలు కాపీని మీరు కలిగి ఉండాలి. వార్తాపత్రిక ఫోటోకాపీ గెజిట్ నోటిఫికేషన్ కోసం చెల్లదు. మీరు మీ దరఖాస్తు ఫారమ్‌తో వార్తాపత్రిక అసలు కాపీని జతచేయాలి.
పేరు మార్పు కోసం, మీరు మీ గుర్తింపునకు సంబంధించిన పత్రాలను జోడించాలి. వీటిలో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ ఉన్నాయి. వీటితో పాటు రెండు ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన.. చివరి డాక్యుమెంట్ అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ ను ప్రచురణ విభాగం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లు పెద్దవారికి, మైనర్‌లకు వేర్వేరుగా ఉంటాయి. మైనర్ పేరు మార్చవలసి వస్తే, ఆ వ్యక్తి గార్డియన్ చర్యలు తీసుకుంటారు. ఒక వయోజన వ్యక్తి తన అప్లికేషన్ ను స్వయంగా నింపాలి. ఈ అప్లికేషన్ ఫామ్ లో ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. ఈ సాక్షులు పేరు మార్చుకోవాలనుకునే వ్యక్తి తమకు తెలుసని ఇక్కడ ప్రకటించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఫామ్‌ను ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం.. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణ కేంద్రం – రాష్ట్ర ప్రచురణ విభాగం ద్వారా జరుగుతుంది. అటువంటప్పుడు, పేరు మార్పు కోసం ఫామ్‌ను ప్రచురణ విభాగంలో సమర్పించాల్సి ఉంటుంది. మీరు ఈ ఫారమ్‌ను పోస్ట్ ద్వారా పంపవచ్చు లేదా మీరు స్వయంగా వెళ్లి సమర్పించవచ్చు. దీని కోసం, నిర్ణీత రుసుము సుమారు వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌తో పాటు ఫీజు రసీదును సమర్పించాల్సి ఉంటుంది. రజని హైదరాబాద్ లో నివసిస్తున్నందున, ఆమె తన దరఖాస్తును జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పించవచ్చు. DM కార్యాలయంలో అటువంటి దరఖాస్తులను రాష్ట్ర ప్రచురణ విభాగానికి పంపే సెల్ ఉంటుంది.
గెజిట్ ప్రచురణ వారానికోసారి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, దీనిని డిజిటల్‌గా మాత్రమే ప్రచురిస్తారు. అంటే, దాని హార్డ్ కాపీ అందుబాటులో ఉండదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వెబ్‌సైట్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది ఇఛ్చి ఉంటారు. అటువంటప్పుడు, మీ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ అయిందో మీరే చెక్ చేసుకోవాలి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో, డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ అలాగే ఇమెయిల్‌లో మెసేజ్ పంపిస్తారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన మీ పేరు మార్పు గెజిట్ నోటిఫికేషన్ సాఫ్ట్ కాపీని మీరు మీ వద్ద ఉంచుకోవాలి. దీని ద్వారా, మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన మీ డాక్యుమెంట్‌లలో మీ పేరును మార్చుకోవచ్చు.
సాధారణంగా, ప్రజలు అఫిడవిట్‌ను తయారు చేసి, రెండు వార్తాపత్రికలలో సమాచారాన్ని ప్రచురించడం ద్వారా, వారు తమ పేరును మార్చుకోగలుగుతారని భావిస్తారు. చట్టపరంగా ఇది మొత్తం ప్రక్రియ కాదు.
మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్లయితే, అటువంటి సవరణ కోసం అఫిడవిట్ పొందడం అంటే, కోర్టు నుంచి ప్రమాణ పత్రం. దానిని రెండు వార్తాపత్రికలలో ముద్రించడం పని చేస్తుంది. ప్రభుత్వ శాఖల్లో పేరు లేదా ఇంటిపేరు మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ అవసరం. మీరు ఈ ప్రక్రియ మీకు మీరుగా చేసుకోవడం కష్టం అనిపిస్తే, మీరు న్యాయవాదిని సంప్రదించవచ్చు. కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్ కూడా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. సుమారు 6500 రూపాయలవరకూ దీనికి ఖర్చు కావచ్చు. అక్కడ నుంచి కూడా మీ పేరు మార్చుకునే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి