EPF Withdrawal: అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్‌తో ఆర్థిక భరోసా.. విత్‌డ్రా మరింత సింపుల్

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక జనాభా కారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగితో పాటు యాజమాన్యం సమాన వాటాలతో పొదుపు చేస్తుంది. అయితే ఇందులో కొంత మొత్తం పెన్షన్ పథకాన్ని జమ చేయగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు.

EPF Withdrawal: అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్‌తో ఆర్థిక భరోసా.. విత్‌డ్రా మరింత సింపుల్
Epfo
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:50 PM

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక జనాభా కారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగితో పాటు యాజమాన్యం సమాన వాటాలతో పొదుపు చేస్తుంది. అయితే ఇందులో కొంత మొత్తం పెన్షన్ పథకాన్ని జమ చేయగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక అత్యవసర సమయంలో ఈ సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చని చాలా మందికి తెలుసు. కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ అందుబాటులో ఉంది. అలాగే కొన్ని యాప్స్ ద్వారా కూడా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మీరు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందాలనుకుంటే పీఎఫ్ ఉపసంహరణ వేగంగా అందిస్తారు. అలాగే మీరు పిల్లలను చదివేందుకు పీఎఫ్‌ను కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ సోదరుడు-సోదరి లేదా కొడుకు, కుమార్తె వివాహంం కోసం పీఎఫ్ ఖాతా నుండి డబ్బును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా ఇంటిని మరమ్మతులు చేయడానికి నిధులను ఉపసంహరించుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో దరఖాస్తు ఇలా

  • పీఎఫ్ ఉద్యోగులు ముందుగా యూఏఎన్, పాస్‌వర్డ్ సహాయంతో ఈపీఎఫ్ఓ ​​పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అనంతరం ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా క్లెయిమ్‌ను ఎంచుకుని ఆటో మోడ్ సెటిల్‌మెంట్‌పై క్లిక్ చేయాలి.
  • విత్ డ్రాకు ముందు ఆ తర్వాత బ్యాంకు ఖాతాను వెరిఫై చేసుకోవాలి. పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయడం లేదా ఖాతాను తనిఖీ చేయడం అవసరం.
  • అనంతరం డబ్బును ఉపసంహరించుకోవడానికి గల కారణాన్ని తెలియజేసి, అప్లికేషన్ సమర్పించాలి. 

ఉమంగ్ యాప్ 

  • పీఎఫ్ ఉద్యోగులు ఉమంగ్ యాప్ ద్వారా కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ముందుగా యూఐడీ లేదా మొబైల్ నంబర్ కింద ఉమంగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • ఈపీఎఫ్ఓ ​​సర్వీస్ ఎంపికను ఎంచుకోవాలి.
  • అనంతరం ఆధార్ లేదా మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఈపీఎఫ్ఓ ​​సేవకు లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీను నమోదు చేయాలి.
  • తర్వాత పీఎఫ్ విత్‌డ్రావల్ ఆప్షన్‌కి వెళ్లి, క్లెయిమ్ ఫారమ్‌ను క్లిక్ చేయాలి.
  • అవసరమైన అన్ని వివరాలను పూరించి, సమర్పించాలి.
  • అనంతరం మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీను మళ్లీ నమోదు చేయాలి.
  • అదనపు సమాచారం కోసం పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయమని అభ్యర్థించిన తర్వాత మీ పీఎఫ్ డబ్బు సుమారు 7 నుంచి 10 రోజుల్లో వస్తుంది. ఈ వ్యవధిలోపు డబ్బు రాకపోతే 1800 180 1425లో హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..