AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Emergency: ఆపద సమయంలో ఆర్థిక భరోసా.. ఆ లోన్‌తో ఊహించని ప్రయోజనాలు

ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులంటే సామన్య ప్రజలు హడలిపోయేలా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఏళ్లుగా చేసుకున్న పొదుపును వైద్య ఖర్చులు హరించేస్తాయి. మెడికల్ ఎమర్జెన్సీ ఖర్చులు తరచుగా ఆర్థికంగా దెబ్బతీస్తాయి. అయితే అనుకోని వైద్య ఖర్చులకు పొదుపును వాడేంటే పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Medical Emergency: ఆపద సమయంలో ఆర్థిక భరోసా.. ఆ లోన్‌తో ఊహించని ప్రయోజనాలు
Money Astrology
Nikhil
|

Updated on: Aug 31, 2024 | 5:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులంటే సామన్య ప్రజలు హడలిపోయేలా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఏళ్లుగా చేసుకున్న పొదుపును వైద్య ఖర్చులు హరించేస్తాయి. మెడికల్ ఎమర్జెన్సీ ఖర్చులు తరచుగా ఆర్థికంగా దెబ్బతీస్తాయి. అయితే అనుకోని వైద్య ఖర్చులకు పొదుపును వాడేంటే పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ లోన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా తక్షణ వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇది ఆదర్శవంతమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం. 

అధిక రుణ మొత్తం

తక్షణ రుణాలు అధిక రుణ మొత్తాలను అందిస్తాయి. అందువల్ల ముఖ్యమైన వైద్య ఖర్చులను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆసుపత్రిలో చేరినా, శస్త్రచికిత్స లేదా చికిత్సానంతర సంరక్షణ అయినా అందుబాటులో ఉన్న అధిక రుణ మొత్తాలు మీ పొదుపును తగ్గించకుండా ఈ ఖర్చులను నిర్వహించడంలో సహాయపడతాయి.

వడ్డీ రేట్లు

రుణం  అంటేనే చాలా మంది వడ్డీ రేట్ల గురించి భయపడుతూ ఉంటారు. ఇన్‌స్టంట్ లోన్స్ తరచుగా పోటీ వడ్డీ రేట్లతో వస్తాయి. ఇవి క్రెడిట్ కార్డ్లు లేదా పేడే లోన్ల వంటి ఇతర రకాల క్రెడిట్‌లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు కారణంగా తిరిగి చెల్లింపును మరింత సమర్థవంతంగా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ 

రీపేమెంట్ నిబంధనలలో సౌలభ్యం ఇన్‌స్టంట్ లోన్‌ను మరింత సౌకర్యంగా చేస్తుంది. రుణ తీసుకున్న వారు ఇన్‌స్టంట్ లోన్ కారణంగా తమ ఆర్థిక పరిస్థితికి బాగా సరిపోయే షెడ్యూల్ను ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. అందువల్ల వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా రీపేమెంట్ సాధ్యం అవుతుంది. 

అసురక్షితం

ఇన్‌స్టంట్ లోన్ సాధారణంగా అసురక్షితంగా ఉంటుంది. అంటే మీరు లోన్ను సెక్యూర్డ్ చేయడానికి ఎలాంటి కొలేటరల్‌ను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. వైద్యపరమైన అత్యవసర సమయంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఆస్తులను రిస్క్ చేయకుండానే నిధులను యాక్సెస్ చేయవచ్చు. 

కనీస డాక్యుమెంటేషన్

ఇన్‌స్టంట్ లోన్స్ పొందడానికి కనీస డాక్యుమెంటేషన్ అవసరం. ఈ స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ లోన్ అప్లికేషన్, అప్రూవల్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది. అందువల్ల మీకు అవసరమైన నిధులను త్వరగా పొందవచ్చు.

త్వరిత ఆమోదం, తక్షణ పంపిణీ

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వేగం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ అవసరాన్ని తీర్చడానికి ఇన్‌స్టంట్ రుణాలు సౌకర్యంగా ఉంటాయి. ఇన్‌స్టంట్ లోన్ దరఖాస్తు ప్రక్రియ తరచుగా సులువుగా ఉంటుంది. అలాగే వెంటనే సొమ్మును అకౌంట్‌లో వేస్తారు. అందువల్ల లోన్ పొందడం చాలా సులభంగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి