Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mi Phones For PhotoGraphy : ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. ఈ ఎంఐ ఫోన్స్‌తో మధుర క్షణాలు క్లిక్ చేసుకోండిలా..

ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది తమ జీవితంలో ఉండే మధురమైన క్షణాలు సింపుల్‌గా క్లిక్ చేసి సేవ్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆనందపడుతున్నారు.

Mi Phones For PhotoGraphy : ఫొటోగ్రఫీ లవర్స్‌కు పండగే.. ఈ ఎంఐ ఫోన్స్‌తో మధుర క్షణాలు క్లిక్ చేసుకోండిలా..
Mi Store
Follow us
Srinu

|

Updated on: Mar 29, 2023 | 3:30 PM

ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో ఫోన్ అంటే కేవలం మెసేజ్‌లు పంపుకోడానికి, కాల్స్ మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించే వారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌లో కెమెరా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది తమ జీవితంలో ఉండే మధురమైన క్షణాలు సింపుల్‌గా క్లిక్ చేసి సేవ్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆనందపడుతున్నారు. క్రమేపి ఇలాంటి వారు పెరగడంతో కంపెనీలు కూడా తమ ఫోన్స్‌లో ఎక్కువ ఫిక్సెల్స్‌తో ఉండే ఫోన్లు రిలీజ్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఎంఐ ఫోన్స్‌ అధునాతన కెమెరాలతో ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. ఎంఐ ఫోన్స్‌లో  స్పష్టమైన, వివరణాత్మక ఛాయాచిత్రాలను రూపొందించే అద్భుతమైన కెమెరాలకు ప్రసిద్ధి చెందాయి. కాబట్టి టెక్ నిపుణులు సూచించే టాప్ కెమెరాలతో అందుబాటులో ఉన్న ఎంఐ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.

ఎంఐ 11 ఎక్స్ ప్రో 5జీ

అందమైన 6.67 ఎమో ఎల్ఈడీ డాట్ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 5 ఎంపీ సూపర్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 888 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ ప్రత్యేకం. 8 జీబీ + 128 జీబీ వెర్షన్‌లో వచ్చే ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4520 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ఎంఐ 11 టీ ప్రో 5 జీ

స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ 5 ఎన్ఎం ఫ్యాబ్ ప్రాసెస్‌ను కలిగి ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రత్యేకం. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్, వివిడ్ పిక్చర్‌లతో వేగవంతమైన టచ్ రెస్పాన్స్‌ను అందిస్తుంది. 108 ఎంపీ కెమెరాతో 8 ఎంపీ, 5 ఎంపీ టెలీమాక్రో సెన్సార్‌తో 8కే వీడియో రికార్డింగ్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రో-గ్రేడ్ ఇమేజ్‌ల కోసం ఉపయోగించడానికి సులభమైన మోడ్‌లతో ఈ ఫోన్‌ సూపర్‌గా పని చేస్తుంది. డ్యూయల్ స్పీకర్‌‌లు అద్భుతమై సౌండ్ అనుభూతిని అందిస్తాయి. 120 వాట్స్ హైపర్‌ఛార్జ్ టెక్నాలజీతో కేవలం 17 నిమిషాల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంఐ 11 ఎక్స్

8 ఎంపీ అల్ట్రా-వైడ్ 5 ఎంపీ సూపర్ మాక్రో లెన్స్‌తో 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ కచ్చితంగా సెల్ఫీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. సెల్ఫీ లవర్స్ కోసం 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత 6.67 ఫుల్ హెచ్‌డీ ఎమో ఎల్ఈడీ డాట్ డిస్‌ప్లే, ఎంఈఎంసీ టెక్నాలజీతో వచ్చే ఈ ఫోన్ అద్భుతమైన స్క్రీన్ కలిగి ఉంటుంది.

రెడ్ మీ నోట్ 11 టీ 5 జీ

ఈ స్మార్ట్‌ఫోన్  ఫుల్ హెచ్‌డీ ఆడాప్టివ్ సింక్ డిస్‌ప్లేతో వస్తుంది. 50 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా ప్రతి వివరాలను అద్భుతమైన స్పష్టతతో క్యాప్చర్ చేస్తుంది. అలాగే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరైనది. ఈ ఫోన్‌తో, మీరు స్నేహితులతో జ్ఞాపకాలను క్యాప్చర్ చేసుకునేందుకు మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఎంఐ 11 ఐ 5జీ

మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ ఫ్లూయిడ్ పనితీరును అందిస్తుంది. 8 జీబీ+ 128 జీబీ వేరింయట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో మరింత ఎక్కువ డేటాను సేవ్ చేయవచ్చు. 6.67 అంగుళాలు ఫుల్ హెచ్‌డీ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన సెల్ఫీలు తీసుకునేలా 16MP ఫ్రంట్ కెమెరా, అలాగే 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 5160 భారీ బ్యాటరీ సామర్థ్యంతో సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..