FD Interest Rates: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన పంజాబ్ నేషనల్‌ బ్యాంక్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది...

FD Interest Rates: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన పంజాబ్ నేషనల్‌ బ్యాంక్.. ఫిక్స్‌డ్‌  డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..
Interest Rates
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 15, 2022 | 9:20 AM

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ FDలపై పెంచిన వడ్డీ రేట్లు జూన్ 14, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఒక సంవత్సరం, రెండేళ్ల FDలపై అందించే వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. ఆ తర్వాత అది 5.10 నుండి 5.20 శాతానికి పెరిగింది. ఇది కాకుండా బ్యాంకు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల FDలపై వడ్డీ రేట్లను 5.30 శాతానికి పెంచింది. PNB FDలపై వడ్డీ రేట్లను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే మీరు PNBలో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు FD చేస్తే, బ్యాంకు మీకు 5.50 శాతం వడ్డీని ఇస్తుంది. ఇది అంతకు ముందు 5.25 శాతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న FD లకు ఇప్పుడు 5.25 శాతానికి బదులుగా 5.60 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఇతర అన్ని FDల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేయలేదు.

ఇంతకుముందు బ్యాంక్ మే 7, 2022 నుంచి అమలులోకి వచ్చేలా వివిధ అవధుల FDల వడ్డీ రేట్లను 60 బేసిస్ పాయింట్లు లేదా 0.60 శాతం పెంచింది. జూన్ 8, 2022న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రెపో రేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. దీని కారణంగా రుణం ఖరీదైనదిగా మారడంతో EMI భారం కూడా పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి అనేక ఇతర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.