AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FacebooK: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‎కు పెద్ద షాక్.. టెలిగ్రామ్‎కు మారిన 70 మిలియన్ల మంది..

ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ కేవలం మిలియన్ డాలర్ల డబ్బునే కోల్పోలేదు... భారీ సంఖ్య తమ ఖాతాదారులను కోల్పోయారు. ఒక్కరోజులోనే దాదాపు 70 మిలియన్ల మంది...

FacebooK: ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‎కు పెద్ద షాక్.. టెలిగ్రామ్‎కు మారిన 70 మిలియన్ల మంది..
Telegram
Srinivas Chekkilla
|

Updated on: Oct 06, 2021 | 7:08 PM

Share

ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ కేవలం మిలియన్ డాలర్ల డబ్బునే కోల్పోలేదు… భారీ సంఖ్యలో తమ ఖాతాదారులను కోల్పోయారు. ఒక్కరోజులోనే దాదాపు 70 మిలియన్ల మంది టెలిగ్రామ్‎కు మారిపోయారు. సోమవారం ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‎స్టాగ్రామ్ సేవలు ఆరు గంటలపాటు నిలిచిపోయాయి. ఈ సమయంలో చాలామంది టెలిగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు మారారు. 3.5 బిలియన్ యూజర్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ నిలిచిపోవటంతో ఇబ్బంది పడ్డారని ఫేస్‌బుక్  సంస్థ తెలిపింది. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పు కారణంగా సమస్య తలెత్తినట్లు చెప్పింది. తమకు ఒక్క రోజులో 70 మిలియన్ల మంది కొత్త వినియోదారులు వచ్చినట్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తెలిపారు. వారికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.

ప్లాట్‌ఫారమ్ చాలా బాగ ఉంటుందని.. ఇతర దేశాల నుంచి క్రమంగా వినియోగదారులు పెరుగుతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన వారు ఇక్కడే ఉండి తమ వర్కును చూడాలన్నారు. ఇతర ప్లాట్‎ఫారమ్స్ కంటే మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. కొంతమంది పెద్ద ఆటగాళ్లపై ఆధారపడటం ద్వారా ఏమి జరుగుతుందో ఈ ఘటనను చూస్తే తెలుస్తుందని ఈయూ యాంటీట్రస్ట్ చీఫ్ మార్గ్రేత్ వెస్టేజర్ అన్నారు. కేవలం పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్లాట్‎ఫారమ్స్‎పై ఆధారపడితే ఇలానే ఉంటుందని ఆయన ఇన్‎డైరెక్టుగా చెప్పారు. ఈ ఘటనతో రష్యా తన సొంత ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్స్, సోషల్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకోవడం మంచిదేనని గ్రహించదన్నారు.

గోప్యతా నిబంధనలను మార్చినప్పుడు ఫేస్‌బుక్ నేతృత్వంలోని వాట్సాప్ తన చందాదారులను టెలిగ్రామ్‌కు కోల్పోయింది. గత జనవరిలో టెలిగ్రామ్ అత్యధిక మంది డౌన్‌లోడ్ చేసుకున్న నాన్-గేమింగ్ యాప్‌గా మారింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంతరాయం కలగటంతో క్రిప్టోకరెన్సీ, రష్యన్ చమురు సంస్థలు, ట్రేడింగ్‌ చేసేవారు నష్టపోయారని.. టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్స్ వల్ల ఇలాంటి నష్టం ఉండదన్నారు.

Read Also.. Stock Market: బుల్ జోరుకు బ్రేకులు.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు.. కారణం ఏమంటే..?