AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook BARS App: టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌.. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి..

Facebook BARS App: ఫేస్‌ బుక్‌ ఇటర్నల్‌ ఆర్‌ అండ్‌ డీ గ్రూప్‌ అయిన న్యూ ప్రొడక్ట్‌ ఎక్స్‌పెరిమెంటేషన్‌ బృందం ప్రయోగాత్మకయాప్‌ బార్స్‌ (బీఏఆర్‌ఎస్‌)ను ఆదివారం అందుబాటులోకి ...

Facebook BARS App: టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌.. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి..
Subhash Goud
|

Updated on: Feb 28, 2021 | 4:16 PM

Share

Facebook BARS App: ఫేస్‌ బుక్‌ ఇటర్నల్‌ ఆర్‌ అండ్‌ డీ గ్రూప్‌ అయిన న్యూ ప్రొడక్ట్‌ ఎక్స్‌పెరిమెంటేషన్‌ బృందం ప్రయోగాత్మకయాప్‌ బార్స్‌ (బీఏఆర్‌ఎస్‌)ను ఆదివారం అందుబాటులోకి తీసుకువచ్చింది. టిక్‌టాక్‌ మాదిరిగానే ఈ యాప్‌ను ప్రత్యేకంగా రాపర్ల కోసం రూపొందించారు. ఈ యాప్‌ ఫేస్‌బుక్‌ ఎన్‌పీఈ బృందం తయారు చేసిన రెండో మ్యూజిక్‌ యాప్‌. అంతకు ముందు కొల్లాబ్‌ అనే మ్యూజిక్‌ వీడియో యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. కొల్లాబ్‌ యాప్‌ సంగీతంతో ప్రారంభించిన ఒరిజినల్‌ వీడియోలను సృష్టించడానికి, చూడడానికి, కలపడానికి, సరిపోల్చడంతో పాటు సంగీతం సృష్టికర్తలు , అభిమానులను ఒకచోట చేర్చడానికి ఉపయోగపడుతుంది. అయితే సింగర్స్‌ సొంతంగా రాపర్స్‌ వీడియోలను తయారు చేసుకోవడం, పంచుకోవడం ఈ బార్స్‌ ప్రత్యేకత. ఈ యాప్‌లో వందలాది బీట్‌లు అందుబాటులో ఉంచారు. వీటిలో నుంచి ఒక దానిని ఎంచుకుని వినియోగదారులు తమ వీడియోను సిద్దం చేసుకోవచ్చు. ఈ యాప్‌లో 60 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్‌ ఛాలెంజ్ మోడ్‌ను కూడా ఇచ్చింది. ఇక్కడ, వినియోగదారులు ఆటో సడన్‌ పదాలతో క్యూ చెప్పి ఫ్రీస్టైల్‌లో పూర్తిచేయవచ్చు. ఇది ఒకరకంగా ఆట లాంటి మోడ్. ర్యాప్‌ను ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ యాప్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే వీడియో నిడివి 60 సెకన్ల వరకు ఉండవచ్చు. వీడియోను రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అంతేకాదు దానిని నేరుగా సోషల్‌ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఈ బీఏఆర్‌ఎస్‌ను రూపొందించడంలో ఫేస్‌బుక్‌ ఎన్‌పీఈ బృందం కీలక పాత్ర పోషించింది.

కాగా, ఈ యాప్‌ కొల్లాబ్ అనువర్తనంలో సంగీతంతో ప్రారంభించి , వీడియోలను సృష్టించడానికి, చూడటానికి మరియు కలపడానికి మరియు సరిపోల్చడానికి వినియోగదారులను అనుమతిస్తుంది ఎన్‌పీఎస్‌ పేర్కొంది. అయితే గతంలో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌ ఎంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల కిందట దేశ భద్రతలో భాగంగా చైనాకు సంబంధించి టిక్‌టాక్‌ సహా చాలా వరకు యాప్‌లను బ్యాన్‌ చేసింది. తాజాగా అదే తరహాలో ఫేస్‌బుక్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈయాప్‌ ద్వారా ఇందులో పోస్ట్‌ చేసే వీడియోలను ఎవరైనా యూజర్లు తీసుకొని వాటితో తమకిష్టమైన రీతిలో మరో వీడియో తయారుచేసి కొల్లాబ్‌లో పోస్ట్‌ చేసుకోవచ్చని ఫేస్‌బుక్‌ సంస్థ వివరించింది.

ఇవీ చదవండి:

Ayodhya Ram Mandir: ముగిసిన అయోధ్య రామ మందిరం విరాళాల సేకరణ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Hyderabadi Biryani: 60 రూపాయలకే తిన్నంత బిర్యానీ.. ఎక్కడో తెలిస్తే మీరు కూడా వెళ్తారు..!