Ayodhya Ram Mandir: ముగిసిన అయోధ్య రామ మందిరం విరాళాల సేకరణ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ జనవరి 15 నుంచి విరాళాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ..

Ayodhya Ram Mandir: ముగిసిన అయోధ్య రామ మందిరం విరాళాల సేకరణ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2021 | 3:46 PM

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ జనవరి 15 నుంచి విరాళాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజల నుంచి స్వచ్చందంగా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27తో పూర్తయింది. అయితే ఇలా సేకరించిన మొత్తం రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సేకరించిన ఇంకా కొంత డబ్బు బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్‌ కార్యాలయ ఇన్‌చార్జీ ప్రకాశ్‌ ఉప్తా ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… ప్రస్తుతానికి మేము సేకరించిన విరాళాల మొత్తాన్ని అంచనా వేశామని, ఇది దాదాపు 2 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. మొత్తం ఎంత విరాళం సేకరించామనే లెక్కలు తేలడానికి నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన చాలా చెక్కులు ఇకా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, శుక్రవారం నుంచి బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినందున ఆలస్యం అవుతుందని అన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎంతనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పూర్తి మొత్తం ఎంత విరాళాలు సేకరించామనేది తేలుతుందని అన్నారు.

కాగా, అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు.

అయితే రామాలయ రూపకల్పనలో ఐఐటీలు, ఇతర సంస్థల సాయం చేయనున్నాయని, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు. అలాగే దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని ప్రకటించినట్లుగానే అన్ని ప్రాంతాలకు వెళ్లి విరాళాలు సేకరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. కేవలం స్వదేశీ నిధులతోనే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని శ్రీరామ ట్రస్ట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ ప్రచార కార్యక్రమం ద్వారా వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని, ఇందు కోసం రూ.10, రూ.100, రూ.1000 విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతూ విరాళాలు సేకరించింది రామ జన్మభూమి ట్రస్ట్‌.

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!

ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్..రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా
ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్..రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
కావ్యమారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల ప్రపంచ రికార్డ్ బ్రేక్
కావ్యమారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల ప్రపంచ రికార్డ్ బ్రేక్
బుధ అస్తంగత్వ దోషం.. వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి
బుధ అస్తంగత్వ దోషం.. వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి
పెళ్లైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
పెళ్లైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి
మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి
భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు