AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!

పిరమిడ్స్ అనగానే ఈజిప్టు గుర్తుకొస్తుంది అందరికీ అయితే మన దేశంలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పిరమిడ్ నిర్మాణం జరిగిందని కొంతమందికే తెలుసు.. వేద కాలం నాడు ఈ ప్రదేశం అత్యంత ప్రాముఖ్యంగలదని...

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 28, 2021 | 2:58 PM

Share

Ahichchhatra Pyramid: పిరమిడ్స్ అనగానే ఈజిప్టు గుర్తుకొస్తుంది అందరికీ అయితే మన దేశంలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పిరమిడ్ నిర్మాణం జరిగిందని కొంతమందికే తెలుసు.. వేద కాలం నాడు ఈ ప్రదేశం అత్యంత ప్రాముఖ్యంగలదని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. మరి గ్రామం ఎక్కడ ఉంది.. దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..!

అహిఛత్ర లేదా అహి క్షేత్ర ఉత్తర ప్రదేశ్ లోని బరేలి జిల్లాలోని రామనగర్ గ్రామం లో ఉంది. అహి అంటే సంస్కృతంలో నాగ లేదా పాము అని అర్ధం. అహిర్ లు అంటే సర్పారాధికులు ఉండే ప్రదేశం.. అందుకనే ఈ ప్రాంతానికి అహిఛత్ర లేదా అహి క్షేత్ర అనే పేరు వచ్చింది. అయితే ఇదంతా ఓ వెయ్యి సంవత్సరాలు లేదా 15 వందల సంవత్సరాల క్రితం మాట. కొందరు ఆర్కియాలజిస్టులు ఒకటవ శతాబ్దం మొదట్లో ఈ ప్రదేశాన్ని అహిఛత్ర లేదా అహి క్షేత్ర అని పిలిచేవారని చెపుతున్నారు.

చరిత్ర :

అయితే ఈ ప్రదేశం వేద కాలం నాటిది. మహాభారతము లో ద్రౌపది తండ్రి దృపదుడు పాలించిన పాంచాల దేశం ఇప్పటి బరేలీ ప్రాంతం. దృపదుడు అవమానించాడు అన్న కారణంగా ద్రోణాచార్యుడు పాండవులకి యుద్ధ విద్యలు నేర్పి.. అనంతరం గురుదక్షిణగా పాంచాల రాజు దృపడుని యుద్ధంలో ఓడించి దృపదుడి ని బంధించి తెమ్మని ప్రియ శిష్యుడైన అర్జునుడిని అడుగుతాడు.

గురు దక్షిణగా అర్జునుడు దృపదుడి ని యుద్ధం లో ఓడించి.. అతనిని బంధించి తన గురువు ద్రోణాచార్యుడి పాదాల వద్ద పడేస్తాడు అర్జునుడు. అప్పటి నుండి పాంచాల దేశం ద్రోణాచార్యుడి ఆధీనం లో ఉంది. అయితే దృపదుడిని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తాడు ద్రోణుడు. తరువాత దృపదుడు పాంచాల దేశానికి దక్షిణ దిక్కున కంపిల్యని రాజధానిగా చేసుకొని మిగతా రాజ్యాన్ని పాలించాడు. అర్జునుడు గురు దక్షిణగా ఇచ్చిన ఉత్తర పాంచాల దేశాన్ని ద్రోణాచార్యుని కుమారుడు అశ్వద్ధామ పాలించాడు దుర్యోధనుడికి సామంత రాజుగా. ఇది మనం మాహాభారతమ లో చదివినదే.

అయితే మహాభారత కాలం తరువాత ఈ ప్రదేశం 2000 bc లో అహిర్ జాతి వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. అప్పట్లో ఈ ప్రదేశము అతి పెద్ద నగరంగా ఉండేది. అయితే ఇక్కడ ఒక పెద్ద కట్టడం బయట పడ్డది. ఈ కట్టడం మొత్తం ఒక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉంటుంది పైన ఎత్తయిన శివుని విగ్రహం ఉంటుంది. ఇది ప్రస్తుతం రాంనగర్ అనే గ్రామంలో ఉంది. 12 వ శతాబ్దం లో ముస్లిం దండయాత్రల సమయంలో ఈ కట్టడం కూడా దాడికి గురైంది. అయినప్పటికీ ఈ కట్టడం ఇప్పటికీ చాలా ఎత్తులో ఉంది.. పైగా దాని మీద 22 మీటర్ల ఎత్తయిన శివ లింగం ఉంది. ఇది ఎంత పెద్దది అంటే మొత్తం 187 హెక్టార్ల స్థలంలో ఈ పిరమిడ్ నిర్మించబడింది.

ఈ ప్రదేశం మళ్ళీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే..?

మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో 1871 లో అలెక్జాoడర్ కన్నింగ్ హామ్ అనే బ్రిటీష్ కమాండర్ ఈ కట్టడాన్ని కనుక్కున్నాడు. అప్పట్లో బ్రిటీష్ వాళ్ళు బెంగాల్ నుంచి పరిపాలిస్తున్న రోజుల్లో సైన్యం లో పనిచేసేవాడు తరువాతి కాలం లో పురావస్తు శాఖ ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్ గా నియమించింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. 1871 లో అలెక్జాoడర్ కన్నింగ్ హామ్ ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపినపుడు అక్కడి స్థానిక ప్రజలు ఈ కట్టడం వెనుక ఉన్న చరిత్రని చెప్పారు

కట్టడం వెనుక చరిత్ర ఏమిటంటే..?

పాండవుల వనవాసం సమయంలో శ్రీ కృష్ణుని సలహా మేరకు అర్జునుడు పాశుపాతాస్త్రం కోసం శివుని కోసం తపస్సు చేయగా అర్జునుడిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. కిరాతకుడి రూపంలో వచ్చి అర్జునుడితో ద్వంద యుద్ధం చేస్తాడు. ఇది కిరాతార్జునీయంగా మనకి సూపరిచితమే ! శివుడు అర్జునుడికి పాశుపతం ఇచ్చిన ప్రదేశంలోనే అహిరులు ఈ కట్టడం కట్టారు. ఈ ప్రాంతాన్ని సుదీర్ఘ కాలం పాలించారు అహిరులు. ఇక్కడ తవ్వకాలలో దొరికిన శిల్పాలు, విగ్రహాలు లండన్ తో సహా మన దేశంలోని మ్యూజియంల్లో పెట్టారు. 3000 ఏళ్లు బిఫోర్ కామన్ ఎరా [3000 BCA] అప్పటి మహాభారత ము నిజమేనని చెప్పే సాక్ష్యాధారాల్లో ఇది మొదటి స్థానం లో ఉంటుంది.

విషాదం ఏమిటంటే ఇప్పుడు అదే రాంనగర్ ప్రాంత ప్రజలకి ఈ కట్టడం గురుంచి తెలియదు. స్వాతంత్యం వచ్చిన తరువాత కూడా పాలకుల నిర్లక్ష్యంతో మన చరిత్రను మనమే విస్మరిస్తున్నాం అని కొంతమంది చరిత్రకారులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు.

3000 ఏళ్ల నాటి కట్టడం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. అయితే ప్రచారం లేదు కనీసం టూరిస్ట్ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయలేదు. ఇక్కడికి దగ్గరలోనే వనవాసం సందర్భంగా పాండవులు తవ్విన పెద్ద చెరువు ఇప్పటికీ ఉంది ఆలన పాలన లేకుండా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ప్రశ్నార్థకంగా 11 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం.. ఆ డీల్‌ సెట్‌ కాకపోతే ఇదే జరగనుంది..

అమితాబ్ బచ్చన్‌కు మరో శస్త్ర చికిత్స.. ఆందోళనల్లో అభిమానులు.. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు..!

Follow Us
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..