AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త పీఎఫ్‌ రూల్స్‌.. రూ.15,000 నుంచి రూ.25,000కి పెరగనున్న వేతన పరిమితి?

EPFO New Rules: వేతన పరిమితి పెరిగితే ప్రతి నెలా మీ జీతం నుండి కట్ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల మీ చేతికి వచ్చే నగదు తగ్గుతుంది. ఇది మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలో నిల్వ పెరగడం..

EPFO: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త పీఎఫ్‌ రూల్స్‌.. రూ.15,000 నుంచి రూ.25,000కి పెరగనున్న వేతన పరిమితి?
Epfo
Subhash Goud
|

Updated on: Feb 02, 2026 | 7:35 PM

Share

EPFO New Rules: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఒక పెద్ద మార్పు చేయబోతోంది. ప్రస్తుతం నెలకు రూ.15,000గా ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జీత పరిమితిని రూ.25,000కి పెంచే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదన అమలు చేసినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులకు తప్పనిసరి పీఎఫ్‌ కవరేజీని అందిస్తుంది. వారి పదవీ విరమణ పొదుపులు గతంలో కంటే బలంగా ఉంటాయి.

పరిమితిని ఎందుకు పెంచుతున్నారు?

అయితే దేశంలోని కోట్ల మంది ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ఓ (EPFO) వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు బడ్జెట్ 2026లో మోక్షం లభించనుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న వేతన పరిమితి రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ పెన్షన్, పీఎఫ్ నిధి గణనీయంగా పెరగనుంది. అలాగే వేలాది మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రానున్నారు. దీంతో వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

EPF రిటైర్మెంట్ కాలిక్యులేట్ చేసుకోండిలా..

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద పెన్షన్ లెక్కించేటప్పుడు ప్రస్తుత వేతన పరిమితి రూ.15,000 మాత్రమే ప్రాతిపదికగా ఉంది. ఇది రూ.25,000కు పెరిగితే, వృద్ధాప్యంలో వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం రూ. 15,000 కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న వారు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రావడం లేదు. పరిమితిని రూ. 25,000కు పెంచడం వల్ల కొత్తగా దాదాపు 1 కోటి మంది అదనపు ఉద్యోగులు పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాల పరిధిలోకి వస్తారు.

అలాగే జీతం పరిమితి పెంచినట్లయితే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగుల ‘చేతికి వచ్చే జీతం’ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది దీర్ఘకాలిక పొదుపు, పెన్షన్ ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులకు లాభదాయకమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వస్తే, మధ్యతరగతి, తక్కువ వేతన జీవుల ఆర్థిక భవిష్యత్తుకు పెద్ద భరోసా లభిస్తుంది. గతంలో ఈ పరిమితిని రూ. 6,500 నుండి రూ. 15,000కు పెంచారు. ఇప్పుడు ఈ పరిమితిని మరింత పెంచి రూ.25,000 కు మారుస్తారని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర రూ.2 లక్షలలోపు దిగి రానుందా? నిపుణులు ఏమంటున్నారు?

పీఎఫ్ లెక్కింపు ఎలా మారుతుంది?

సాధారణంగా మీ ప్రాథమిక వేతనంలో 12% పీఎఫ్ ఖాతాకు మళ్లిస్తారు. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే ప్రస్తుతం మీ జీతం రూ.30,000 అయినా, పీఎఫ్ కటింగ్ కేవలం రూ.15,000 ప్రాథమిక వేతన పరిమితిపైనే (అంటే రూ.1800) జరుగుతుంది. భవిష్యత్తులో వేతన పరిమితిని రూ.25,000 కు పెంచితే రూ. 3,000 (25,000లో 12%) నేరుగా పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.

EPF పెన్షన్ కాలిక్యులేట్ చేసుకోండిలా..

వేతన పరిమితి పెరిగితే ప్రతి నెలా మీ జీతం నుండి కట్ అయ్యే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల మీ చేతికి వచ్చే నగదు తగ్గుతుంది. ఇది మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలో నిల్వ పెరగడం వల్ల పదవీ విరమణ సమయంలో భారీ మొత్తం అందుతుంది. అలాగే, పెన్షన్ , బీమా ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ పరిమితిని పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇది కూడా చదవండి: Best Scooters: మహిళలకు అనుకూలంగా ఉండే 5 బెస్ట్‌ స్కూటర్లు ఇవే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి