AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ తప్పు చేస్తే మీ వడ్డీ నిలిచిపోయే ఛాన్స్.. కేంద్రం కొత్త రూల్స్..

ఈపీఎఫ్ఓ అకౌంట్ కొన్ని సమయాల్లో ఇనాక్టివ్ మారుతుంది. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఈ పని చేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. దీంతో అకౌంట్ ఇనాక్టివ్ కాకుండా వడ్డీ ఆగిపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటి అనేది చూద్దాం.

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ తప్పు చేస్తే మీ వడ్డీ నిలిచిపోయే ఛాన్స్.. కేంద్రం కొత్త రూల్స్..
Epfo
Venkatrao Lella
|

Updated on: Aug 22, 2026 | 8:22 AM

Share

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ ఒకటి. పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌పై ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీని జమ చేస్తూ ఉంటుంది. ప్రతీ ఏడాది దీనిని అందిస్తూ ఉంటుంది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వడ్డీని ఇటీవల పీఎఫ్ సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇవి చందాదారుల అకౌంట్లోకి వచ్చాయి. అయితే కొన్ని సమయాల్లో పీఎఫ్ వడ్డీ నిలిచిపోయే అవకాశముంది. అకౌంట్ ఇనాక్టివ్ అయితే వడ్డీ అనేది ఆటోమేటిక్‌గా నిలిచిపోయింది. ఏయే సమయాల్లో అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది..? వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అకౌంట్ ఇనాక్టివ్ ఎప్పుడు అవుతుంది..?

ఉద్యోగికి 55 ఏళ్ల నిండాక లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేస్తే మూడేళ్ల వరకు పీఎఫ్ వడ్డీ కొనసాగుతోంది. ఆ తర్వాత అకౌంట్ ఇనాక్టివ్‌గా మారి వడ్డీ నిలిచిపోతుంది. ఇక 50 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటిస్తే 58 ఏళ్ల వయస్సు వచ్చాక అకౌంట్ ఇనాక్టివ్‌గా మారి వడ్డీ ఆగిపోతుంది. ఇక 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే 58 ఏళ్ల వరకు వడ్డీ అందుతుంది. అలాగే 58 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే 61 ఏళ్ల వయస్సు వరకు వడ్డీ కొనసాగుతోంది. ఆ తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇక 70 ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటిస్తే 73 ఏళ్ల వరకు పీఎఫ్ అకౌంట్ కొనసాగుతోంది. ఆ తర్వాత అకౌంట్ ఇనాక్టివ్‌గా మారుతుంది. 55 ఏళ్లలోపు ముందస్తు పదవీ విరమణ ప్రకటిస్తే.. 58 ఏళ్ల వరకు వడ్డీ జమ చేస్తారు. ఆ తర్వాత అకౌంట్‌ను ఇన్ఆపరేటివ్‌గా పరిగణిస్తారు. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ రికార్డులను అప్డేట్ చేసుకోవడం, అర్హులైన బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, విత్ డ్రా కోసం క్లెయిమ్ దాఖలు చేయడం వల్ల అకౌంట్ ఇనాపరేటివ్‌గా మారకుండా కాపాడుకోవచ్చు. మూడేళ్ల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా అకౌంట్‌ను ఇనాక్టివ్ చేస్తుంది. అకౌంట్ ఇనాక్టివ్‌గా మారిన 58 ఏళ్లు వచ్చేంతవరకు వడ్డీ కొనసాగుతాయి.

ఈ పని చేయండి

ఉద్యోగికి 55 ఏళ్లు నిండాక పీఎఫ్ నగదు కోసం క్లెయిమ్ చేసుకోండా అలాగే ఉంచుకుంటే అకౌంట్ ఇనాపరేటివ్ అవుతుంది. ఇక ఉద్యోగి మరణించినా, విదేశాలకు వెళ్లినా కూడా ఇనాక్టివ్ అవుతుంది. మీరు ఏదైనా కంపెనీకి మారినప్పుడు పాత కంపెనీలోని బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీలోకి మార్చుకోవాలి. మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అప్డేట్ చేసుకోవాలి. దీని వల్ల మీకు ఖాతా యాక్టివ్‌గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొంతమంది ఉద్యోగం నుంచి బయటకు వచ్చాక పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకోరు. సంవత్సరాల తరబడి అలాగే ఉంచుకుంటారు. ఇలాంటి సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

Follow Us
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్