Sokudo Electric Scooter: భారత ఈవీ మార్కెట్‌లో మూడు ఈవీ స్కూటర్ల ఎంట్రీ.. వారే అసలు టార్గెట్..!
మొదట్లో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి టైర్-2, టైర్-3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా టాప్ కంపెనీలకు పోటీగా స్టార్టప్ కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సొకుడో మోటో భారత మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. సెలెక్ట్ 2.2, రాపిడ్ 2.2, రాపిడ్ ప్లస్ (లిథియం) పేరుతో రిలీజ్ చేసింది.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల వృద్ధి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా సగటు సామాన్య ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు ఈవీ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలపై ప్రత్యేక డిస్కౌంట్లను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. అయితే మొదట్లో కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈవీ స్కూటర్లు క్రమేపి టైర్-2, టైర్-3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా టాప్ కంపెనీలకు పోటీగా స్టార్టప్ కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా సొకుడో మోటో భారత మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. సెలెక్ట్ 2.2, రాపిడ్ 2.2, రాపిడ్ ప్లస్ (లిథియం) పేరుతో రిలీజ్ చేసింది. ఈ స్కూటర్లు ఫీచర్లపరంగానే కా మైలేజ్ విషయంలో వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కాబట్టి సొకుడో ఈవీ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సొకుడో మోటో రిలీజ్ చేసిన మూడు కొత్త మోడల్లు ఫేమ్-II ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే స్మార్ట్ ఫైర్ ప్రూఫ్ లిథియం ఫెర్రో ఫాస్పేట్ (ఎల్‌ఎఫ్‌పీ) బ్యాటరీలు, ఛార్జింగ్ కోసం 15 ఏఎంపీ కన్వర్టర్‌తో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్లస్ అనేది స్లో- స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి దీనిని ఆర్‌టీఓ నమోదు చేయాల్సిన అవసరం లేదు. 100 కి.మీల పరిధితో వచ్చే సెలెక్ట్ 2.2 (ఆర్‌టీఓ) ధర రూ. 85,889, రాపిడ్ 2.2 (ఆర్‌టీఓ) 100 కిమీ పరిధి వరకు రూ.79,889, ప్లస్ (లిథియం) (నాన్-ఆర్ఓ) 105 కి.మీల పరిధితో రూ. 59,889గా ఉంది. అలాగే ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలని గమనించాలి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 3.5 ఎంఎం, 5.25 ఎంఎం మందంతో ఏబీఎస్ ప్లాస్టిక్ బాడీలతో తయారు చేశారు.
సొకుడో ఈవీ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌పై మూడేళ్ల వారంటీతో పాటు వాహనంపై ఐదేళ్ల వారంటీ అందజేస్తున్నారు. సొకుడో 2023లో అమ్మకాలలో 36 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టుడంతో మరో 15-20 శాతం వృద్ధిని సాధిస్తామని వివరిస్తున్నారు. సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా వ్యవస్థాపకుడు, సీఎండీ, ప్రశాంత్ వశిష్ఠ ఈ లాంచ్‌పై మాట్లాడుతూ ప్రతి నెలా నాన్ ఆర్‌టీఓ లీడ్-యాసిడ్ స్కూటర్లను కొనుగోలు చేసే 5 లక్షల మందికి పైగా వ్యక్తులు పరిమిత శ్రేణి, చిన్న వారంటీల వంటి అసమర్థతలతో చిక్కుకుపోతున్నారని తెలిపారు. సొకుడో కొత్త టూ-వీలర్ మోడల్స్ ద్వారా భారతీయ రైడర్లకు సురక్షితమైన, సమర్థవంతమైన ఎంపికలను సుదీర్ఘ వారంటీలతో పాటు మెరుగైన శ్రేణులతో మరింత సరసమైన ధరకు అందించాలని లక్ష్యంతో కొత్త స్కూటర్లను లాంచ్ చేసినట్లు చెబుతున్నారు. మేడ్ ఇన్ ఇండియాకు అనుగుణంగా సొకుడో ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన విశిష్టమైన, సమగ్రమైన ఫీచర్లు ఈవీ వాహన ప్రియులను ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి