డబ్బు పొదుపు చేయాలనే ప్లాన్ ఉందా? ఈ ఫండ్స్ మీకోసమే.. టాక్స్ సేవింగ్స్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్..
డబ్బు ఇన్వెస్ట్ చేయాలి.. దానిపై ఆదాయం మంచిగా రావాలి.. పైగా టాక్స్ బెనిఫిట్స్ కూడా కావాలి.. రిస్క్ కూడా తక్కువ ఉండాలి. ఇలా చాలా కోరికలు ఉంటాయి ఇన్వెస్టర్స్ కి. సరిగ్గా ఇవన్నీ అందుబాటులోకి ఉండే విధానం ఒకటి ఉంది. పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది.. టాక్స్ కూడా సేవ్ చేస్తుంది..
డబ్బు ఇన్వెస్ట్ చేయాలి.. దానిపై ఆదాయం మంచిగా రావాలి.. పైగా టాక్స్ బెనిఫిట్స్ కూడా కావాలి.. రిస్క్ కూడా తక్కువ ఉండాలి. ఇలా చాలా కోరికలు ఉంటాయి ఇన్వెస్టర్స్ కి. సరిగ్గా ఇవన్నీ అందుబాటులోకి ఉండే విధానం ఒకటి ఉంది. పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది.. టాక్స్ కూడా సేవ్ చేస్తుంది.. అదే ELSS ఫండ్స్. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు. దానిని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించవచ్చు .. ELSS తరచుగా టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో సూపర్‌హీరోగా కనిపిస్తుంది. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. నేరుగా స్టాక్ మార్కెట్‌లోకి వెళ్లడం ప్రమాదకరం. కాబట్టి ముందుకు వెళ్లే ముందు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
ELSS కింద, మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ వర్గంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ కేటగిరీ ఫండ్లలో, ఫండ్ మేనేజర్ 80% వాటాను షేర్లలో పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ELSSని ఇతర టాక్స్ సేవింగ్ ప్రొడక్ట్స్ PPF, FD లేదా NSC వంటి వాటితో పోల్చి చూద్దాం. ELSSలో లాక్-ఇన్ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది, కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే… అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF లో 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసే లోపు ఎంత అవసరం ఉన్నా డబ్బు వెనక్కి తీసుకోవడం కష్టం.
పోర్ట్‌ఫోలియో వైవిధ్యం .. మంచి ట్రాక్ రికార్డ్ కారణంగా, ఇతర టాక్స్ సేవింగ్స్ సాధనాలతో పోలిస్తే ELSS నుంచి మెరుగైన రాబడిని పొందవచ్చు. వాల్యూ రీసెర్చ్ చెబుతున్న దాని ప్రకారం, ELSS గత ఏడాది జూలై 25 వరకు సగటున 19.38% రాబడి ఇచ్చింది. మూడేళ్లలో 23.45%.. ఐదేళ్లలో 12.89% రాబడిని అందించింది. ఇప్పుడు ELSSలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. ELSS ఫండ్‌లు తమ కార్పస్‌లో ఎక్కువ భాగాన్ని షేర్లలో పెట్టుబడి పెడతాయి.
దీని కారణంగా, మార్కెట్ హెచ్చు తగ్గులు రాబడిని బాగా ప్రభావితం చేస్తాయి. షేర్లలో పెట్టుబడి పెట్టిన ఆస్తుల విలువ ఆర్థిక పరిస్థితులు, కంపెనీ పనితీరు, గ్లోబల్ ఈవెంట్‌లు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదీకాకుండా.. ఇన్వెస్టర్ ఒకవేళ అత్యవసరంగా డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే.. ELSSలో పెట్టుబడి కోసం మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉన్నందున అది వీలుకాదు.
మూడేళ్ళ లాక్ ఇన్ పీరియడ్ తరువాత డబ్బు విత్ డ్రా చేసుకుంటే లక్ష రూపాయల వరకూ ఎటువంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. లక్ష రూపాయల కంటే ఎక్కువ లాభాలపై 10% మూలాధాన లాభాల పన్ను సర్ చార్జి తో కలిపి కట్టాల్సి వస్తుంది.
ఉదాహరణకు మీరు ELSSలో 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం… 3 సంవత్సరాల తర్వాత, 22% రాబడి వచ్చింది అనుకుందాం. పెట్టుబడి విలువ 2,72,377 రూపాయలు అవుతుంది. ఇక్కడ మీ మూలధన లాభం 1,22,377 రూపాయలు. కానీ 1 లక్ష రూపాయల వరకు మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంది. కాబట్టి, మీరు 22,377 రూపాయల మొత్తంపై మాత్రమే టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. 10% మూలధన లాభాల పన్ను ప్లస్ 4% సెస్ కూడా ఉంటుంది కాబట్టి, మొత్తం 2,327 రూపాయలు అవుతుంది. అంటే పెట్టుబడి నుంచి పన్ను మినహాయిస్తే మూడేళ్ల తర్వాత పెట్టుబడి విలువ 2,70,050 రూపాయలు అవుతుంది.
పెట్టుబడిదారులు SIP ద్వారా ELSS ఫండ్‌లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీకు సాధారణ పెట్టుబడిని అలవాటు చేస్తుందనీ..ఆర్థిక ప్రణాళిక మెరుగ్గా ఉంటుందనీ వారు చెబుతున్నారు.
చాలా టాక్స్ సేవింగ్స్ ప్రొడక్ట్స్ లో, మీరు ప్రతి నెలా క్రమబద్ధమైన పెట్టుబడి ఆప్షన్ పొందలేరు. ELSS ఫండ్ల విక్రయంపై 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారని గుర్తుంచుకోండి. PPFపై వడ్డీపై ఎలాంటి పన్ను విధించరు. ELSS అనేది అధిక-రిస్క్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ అని గమనించడం ముఖ్యం. నష్టాన్ని తగ్గించుకోవడానికి, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా ఉంచుకోవాలి. సమర్ధవంతమైన ట్రాక్ రికార్డ్.. సమర్ధవంతమైన వ్యూహం కలిగి ఉన్నటువంటి ELSS ఫండ్‌ని ఎంచుకోండి. మీ ఆర్థిక లక్ష్యాల ప్రకారం మీ పెట్టుబడి హోరిజోన్‌ను నిర్ణయించండి.
అంతేకాకుండా, మీరు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారు సహాయం తీసుకుంటే, మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు రిస్క్‌ని మెరుగ్గా నిర్వహించగలుగుతారు. ELSS మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి మీ లాంగ్ టర్మ్ టార్గెట్ కోసం ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టండి .. మెరుగైన ఫలితాలను సాధించడానికి ఓపిక పట్టండి…