Samsung Tesla: టెస్లా, సామ్‌సంగ్‌ల మధ్య భారీ ఒప్పందం.. రూ. 3 వేల కోట్ల డీల్. సైబర్ ట్రక్ వాహనాల్లో..
Samsung Tesla: ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో వేగంగా దూసుకెళుతోంది అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ టెస్లా. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తి...
Samsung Tesla: ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో వేగంగా దూసుకెళుతోంది అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ టెస్లా. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఆసక్తి పెరగడం, ప్రభుత్వాలు సైతం ఈ దిశలో అడుగులు వేస్తుండడంతో టెస్లా జోరును పెంచింది. విద్యుత్‌తో నడిచే వాహనాలలోనూ అధునాతన ఫీచర్లను తీసుకొచ్చే క్రమంలో టెస్లా.. సైబర్ ట్రక్ వాహనాలను రూపొందిస్తోంది. 2019 నుంచి టెస్లా వీటి తయారీలో తలమునకలైంది. ఇదిలా ఉంటే వీటి తయారీలో టెస్లా తాజాగా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్‌తో కీలక ఒప్పందం చేసుకుంది.
వివరాల్లోకి వెళితే టెస్లా రూపొందిస్తోన్న సైబర్ ట్రక్ వాహనాలకు కెమెరా మాడ్యూళ్లను అమర్చనుంది. ఈ మాడ్యూళ్ల కోసం టెస్లా, సామ్‌సంగ్ కంపెనీతో ఏకంగా 436 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 3 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని సామ్‌సంగ్ ఒక ప్రకటనలతో తెలిపింది. ఇక ఈ రెండు కంపెనీల మధ్య ఇలాంటి ఒప్పందాలు జరగడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీల కోసం సామ్‌సంగ్‌తో టెస్లా డీల్‌ను కుదుర్చుకుంది. అలాగే సామ్‌సంగ్ తయారుచేసిన పిక్స్‌సెల్ ఎల్‌ఈడీ ల్యాంప్‌లను కూడా టెస్లా తమ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించుకుంటోంది. ఇక ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్న సైబర్‌ట్రక్ వాహానాల కోసం ఇప్పటివరకు పది లక్షల మంది నమోదు చేసుకోవడం విశేషం.
Also Read: Kokapet lands: నేడు కోకాపేట భూముల వేలం.. వేలం యాక్షన్‌లో పాల్గొనాలని ఉంటే ఇలా చేయండి..
Rotten Eggs: నిర్లక్ష్యం.. నిద్ర మత్తు.. గర్భిణీలకు కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ..