AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు? పూర్తి వివరాలు

దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ), అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. గత సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి ప్రభుత్వం సమర్పించిన వార్షిక పత్రంగా దీనిని భావించవచ్చు. కేంద్ర బడ్జెట్ కు ఒక్కరోజు ముందు పార్లమెంటులో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. వివిధ రంగాల ప్రగతి, వాటి పరిస్థితిని వివరంగా తెలియజేస్తుంది.

Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు? పూర్తి వివరాలు
Budget
Madhu
|

Updated on: Jul 19, 2024 | 5:47 PM

Share

పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ పై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేటాయింపులు, రాయితీలు, పన్ను తగ్గింపులపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ కన్నా ముందు మరో ప్రముఖ అంశం పార్లమెంట్ ముందుకు వస్తుంది. అదే ఆర్థిక సర్వే. గతేడాది దేశ ఆర్థిక వ్యవస్థలో సాధించిన ప్రగతి, రాబోయే ఏడాది ఎదుర్కొనే సవాళ్లు అంచనా వేసి తెలిపే నివేదికను ఆర్థిక సర్వే అంటారు.

ఎవరు తయారు చేస్తారంటే..

దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ), అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. గత సంవత్సరంలో ఆర్థిక స్థితిని సమీక్షించడానికి ప్రభుత్వం సమర్పించిన వార్షిక పత్రంగా దీనిని భావించవచ్చు. కేంద్ర బడ్జెట్ కు ఒక్కరోజు ముందు పార్లమెంటులో ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. వివిధ రంగాల ప్రగతి, వాటి పరిస్థితిని వివరంగా తెలియజేస్తుంది.

ఆర్థిక సర్వే..

బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక సర్వే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన నివేదిక అందిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల కలిగిన ఫలితాలను కూడా వివరిస్తుంది. ఆర్థిక సర్వే తెలియజేసే ముఖ్యమైన అంశాలు ఇవే..

  • వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు తదితర రంగాలను విశ్లేషిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం ఆర్థిక పనితీరును తెలియజేస్తుంది.
  • జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక లోటు తదితర వాటికి సంబంధించిన లెక్కలను తెలియజేస్తుంది.
  • ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి విధాన చర్యలను సూచిస్తుంది. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రయోజనాలు..

దేశ ప్రగతికి, ప్రజల సంక్షేమానికి ఆర్థిక సర్వే (ఎకనామిక్ సర్వే) కీలక పాత్ర పోషిస్తుంది. బడ్జెట్ తయారీ, నిధుల కేటాయింపునకు ఆధారమవుతుంది. ఆర్థిక సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

  • బడ్జెట్ నిర్ణయాలకు మార్గదర్శకంగా మారుతుంది. ఆర్థిక విధానాల రూపకల్పనకు సిఫారసులు అందజేస్తుంది.
  • ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేస్తుంది. తద్వారా పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ప్రభుత్వం తన ఆర్థిక విధానాలకు జవాబుదారీగా ఉంటుంది.
  • ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మునుపటి సంవత్సరాలతో పోల్చడం, భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించడానికి ఉపయోగపడుతుంది.

మూడు భాగాలు..

  • ప్రధానంగా ఆర్థిక సర్వే మూడు భాగాలుగా ఉంటుంది. అతి ముఖ్యమైన మొదటి భాగంలో దేశ ఆర్థిక స్థితి, ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ కీలక ఆర్థిక సమస్యలపై తెలియజేస్తుంది.
  • రెండో భాగంలో ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు సంబంధించిన డేటా, గణాంకాలు, వాటి విభాగాల వివరాలు ఉంటాయి.
  • చివరిదైన మూడో భాగంలో జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణం, ఎగుమతి-దిగుమతి వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ తదితర అంవాలను వివరిస్తుంది.

మొదటి సర్వే..

మొట్టమెదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు. కేంద్ర బడ్జెట్‌తో కలిపి దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే 1964 నుంచి బడ్జెట్ నుంచి వేరు చేసి, దాని కన్నా ముందే సమర్పించడం ప్రారంభించారు. కాగా. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..