Maruti Suzuki eVX: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రత్యేకతలు ఏమున్నాయంటే..

మారుతీ సుజుకీ కార్లకు దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వారి జీవితాలలో ఈ కార్లు భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి విడుదల కానున్న మారుతీ సుజుకి ఈవీక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki eVX: మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రత్యేకతలు ఏమున్నాయంటే..
Maruti Evx
Follow us

|

Updated on: Jul 19, 2024 | 6:28 PM

మారుతీ సుజుకీ కార్లకు దేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వారి జీవితాలలో ఈ కార్లు భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి విడుదల కానున్న మారుతీ సుజుకి ఈవీక్స్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

తొలి ఎలక్ట్రిక్ కారు..

మారుతీ సుజుకీ ఈవీక్స్ (ఎలక్ట్రిక్) కారును ఇప్పటికే అనేక ఆటో షోలలో చాలా సార్లు ప్రదర్శించారు. మారుతీ సుజుకీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం కూడా ఇదే కావడంతో దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కారు సంచలనం రేపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. ఈ కొత్త కారుకు ఎస్కుడో అని పేరు పెట్టవచ్చని జపనీస్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ అయిన హటేనా బ్లాగ్ వెల్లడించింది.

నివేదికల ప్రకారం..

మారుతీ సుజకీ కొత్త కారుకు సంబంధించి అనేక నివేదికలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం.. ఈ కారులో విభిన్న అవసరాలను తీర్చడానికి రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లను అమర్చారు. ఒకటి 40 కేడబ్ల్యూహెచ్, రెండోది 60 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. వాటిలో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనం మన దేశంలో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా కావాలనుకునే వారికి 60 కేడబ్ల్యూహెచ్ వీలుగా ఉంటుంది. ఈ వాహనం అంతర్జాతీయ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా.

భాగస్వామ్యం..

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోవడానికి సుజుకీ కంపెనీ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముందుగా సుజుకి ఎస్కుడో (మారుతీ సుజుకీ ఈవీక్స్)తో రానుంది. అలాగే టయోటా మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాటరీ, అభివృద్ధి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

ఆకట్టుకునే డిజైన్..

కొత్త సుజుకి ఎస్కుడో డిజైన్ చాలా ఆకట్టుకుంటోంది. బయట డిజైన్ లో కొత్త ట్రై ఏరో ఎల్ఈడీ డీఆర్ ఎల్, స్లీక్ హెడ్ లైట్లు, అప్ డేటెడ్ ఓఆర్వీఎమ్, స్పోర్ట్ బంపర్ ఏర్పాటు చేశారు. సైడ్ ప్రొఫల్ లో ప్రోమినెంట్ వీల్ ఆర్చ్, అల్లాయ్ వీల్స్, ఫ్లస్ టైప్ డోర్ హ్యాండిల్ అమర్చారు.

2025లో విడుదలయ్యే అవకాశం..

సుజుకి ఎస్కుడో మన దేశంతో పాటు యూరోప్, జపాన్లలో అందుబాటులో ఉంటుంది. 2025 జనవరి లో మన మార్కెట్ కు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కారుకు ఆదరణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
విడిపోతే బంధాలను తెంచుకోవాల్సిన అవసరం లేదు.. బుల్లితెర నటి..
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?