Restaurant Bills: షాక్ ఇవ్వనున్న రెస్టారెంట్ బిల్లులు.. ఏకంగా 8శాతానికి పైగా పెరిగే అవకాశం.. కాఫీ కూడా తాగలేం..
చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకూ అన్ని చోట్ల ఆహార పదార్థాలపై బిల్లు కనీసం ఐదు నుంచి ఎనిమిది శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కోకో, కాఫీ, పామ్ ఆయిల్, పంచదార వంటి ముడి పదార్థాల ధరలు గత క్వార్టర్లో గణనీయంగా పెరిగాయి. ఈ ధరల ప్రభావం రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పై భారీగా పడుతోంది.

వీకెండ్స్‌లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి డైనింగ్ వెళ్లడం.. ఏదైనా మంచి రెస్టారెంట్లో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని రావడం అందరూ చేస్తుంటారు. బిల్ కూడా మీ అంచనాకు తగ్గట్లుగానే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మీ బడ్జెట్ ఆధారంగానే మీరు ఆర్డర్ ఇచ్చేవి కూడా ఉంటాయి. అయితే ఆ లెక్కలు ఇకపై తప్పుతాయి. ఎందుకంటే మీ రెస్టారెంట్ బిల్లులు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకూ అన్ని చోట్ల ఆహార పదార్థాలపై బిల్లు కనీసం ఐదు నుంచి ఎనిమిది శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కోకో, కాఫీ, పామ్ ఆయిల్, పంచదార వంటి ముడి పదార్థాల ధరలు గత క్వార్టర్లో గణనీయంగా పెరిగాయి. ఈ ధరల ప్రభావం రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పై భారీగా పడుతోంది. దీంతో వారు రెట్లను పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది.
ఆల్ టైం హైలో ధరలు..
దాదాపు ఏడాదిన్నర కాలంలో ఇలా పెరగడం ఇదే తొలిసారని పరిశ్రమ నిర్వాహకులు, రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. కోకో, కాఫీ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠంగా ఉన్నాయని.. పామాయిల్ సంవత్సరానికి 10% పెరిగిందని వివరిస్తున్నారు. డజను రెస్టారెంట్, కేఫ్ చైన్‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ఈ నెలలో ధరల పెంచేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అంతర్జాతీ దిగ్గజ రెస్టారెంట్ల ఓనర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు.
- ఉన్నత స్థాయి ది బిగ్ చిల్ కేఫ్, డెజర్ట్ చైన్ ది బిగ్ చిల్ కేకరీ యజమాని అయిన అసీమ్ గ్రోవర్ మాట్లాడుతూ ముడి పదార్థాల ధరలు, ఖర్చులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ముడి సరుకుల ధరలు బాగా పెరుగుతున్నాయని, ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి కూడా కారణమవుతోందని చెబుతున్నారు. లాభాన్ని ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేయడం కష్టతరం అవుతోందని వివరిస్తున్నారు. కోకో ఉత్పత్తి దేశాలైన ఘనా, ఐవరీ కోస్ట్ వంటి చోట్ల పంటలు నిరాశపరిచిన నేపథ్యంలో కోకో ధరలు రికార్డు స్థాయికి పెరిగి టన్నుకు $10,000 (రూ. 8.3 లక్షలు)కు చేరుకున్నాయని తెలిపారు. గత త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చి త్రైమాసికంలో కోకో ధరలు రెట్టింపు అయ్యాయని వివరిస్తున్నారు.
- అలాగే ప్యాకేజ్డ్ హెల్త్ ఫుడ్ కంపెనీ ద హోల్ ట్రూత్ కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ మెహతా మాట్లాడుతూ తమ తమ డార్క్ చాక్లెట్ ధరలను పెంచకపోతే తాము తమ మిల్క్ చాక్లెట్ ఉత్పత్తిని నిలిపివేస్తామని గత వారం లింక్డ్‌ఇన్ రాశారు. కోకో ధరలు 45 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉన్నాయని, కేవలం ఒక సంవత్సరంలోనే ఉత్పత్తి ధరలు 150% పైగా పెరిగాయని, కోకో బటర్ ధర 300% పెరిగిందని ఆయన అన్నారు.
- చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఇది అధిక ఇన్‌పుట్ ఖర్చులకు దారితీస్తుందని, లిస్టెడ్ స్పెషాలిటీ రెస్టారెంట్, మెయిన్‌ల్యాండ్ చైనా, సిగ్రీ చైర్మన్ అంజన్ ఛటర్జీ అన్నారు. అందుకే తాము తమ ధరలను సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇదే ట్రెండ్ కొనసాగితే తమ మెనూ ధరలను పెంచవలసి వస్తుందని అతను చెప్పాడు. కంపెనీలు ధరలను పెంచితే లాభాల నష్టాన్ని పూడ్చుకోవచ్చని, అదే సమయంలో మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
- మార్కెట్లో చాలా పోటీగా ఉంది, కాబట్టి తాము మొత్తం 5% ధరల పెరుగుదలను మాత్రమే అంగీకరిస్తామని.. అయినప్పటికీ పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను బట్టి ధరలు పెంచవలసి ఉంటుందని రెస్టారెంట్ చైన్ కైలిన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ ఖనిజో అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








