Insurance: కొత్తగా ఉద్యోగం వచ్చిందా? ఆ పని వెంటనే చేయమంటున్న నిపుణులు
భారతదేశ జనాభాలో యువత సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా చదువు పూర్తవగానే లక్షల సంఖ్యలో యువత కొత్త ఉద్యోగాలను పొందుతున్నారు. అయితే కొత్తగా ఉద్యోగం పొందిన వారు కచ్చితంగా పెట్టుబడుల వైపు ఆసక్తి చూపాలని నిపునులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవిత బీమా పథకాల్లో పెట్టుబడి సురక్షితమని సూచిస్తున్నారు.

కొత్తగా ఉద్యోగం పొందిన వారు కచ్చితంగా ఆర్థిక ప్రణాళిక రచించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ కారణంగా ఫోన్‌లోనే పెట్టుబడి యాప్‌లతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల కారణంగా చాలా సులభంగా పెట్టుబడి రుణం తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పెట్టుబడి అనేది బీమా పాలసీల్లో పెడితే మంచి లాభాలు ఉంటాయని సూచిస్తున్నారు. జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా వంటి పథకాల్లో పెట్టుబడి మంచి నిర్ణయం అయిన సూచిస్తున్నారు. ఈ పెట్టుబడులు పన్ను నిర్వహణ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు.
ముందుగానే ప్రారంభించడం
కెరీర్ తొలి సంవత్సరాలు పెట్టుబడులకు కీలకమైనవిగా ఉంటాయి. ఈ సమయంలోనే సరైన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకుంటే జీవితాంతం ప్రయోజనాలను అందిస్తాయి. ఆకస్మిక వైద్య అత్యవసర పరిస్థితులు, ఉద్యోగ నష్టం లేదా ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి మంచి బీమా పథకం రక్షణ కల్పిస్తుంది. ఇంటిని కొనడం, వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా ముందస్తు పదవీ విరమణ కోసం ప్రణాళిక వంటి ప్రధాన జీవిత లక్ష్యాలను సాధించడానికి పునాది వేస్తుంది. ముఖ్యంగా ప్రతి నెలా రూ.5,000 పెట్టుబడి పెట్టడం వల్ల పదవీ విరమణ సమయంలో 35 ఏళ్ల వ్యక్తి కంటే రెండింతలు ఎక్కువ సంపదను పొందవచ్చు.
రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం
భారతదేశంలో బీమాను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అందువల్ల బీమా విషయంలో ఎవరూ సరైన నిర్ణయం తీసుకోరు. అయితే బీమా పథకం అనేది ఆర్థిక రక్షణకు ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా ప్రతి ఉద్యోగికి ఆరోగ్య బీమా చాలా కీలకం. కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమాపై మాత్రమే ఆధారపడకుండా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఉద్యోగ మార్పులతో సంబంధం లేకుండా నిరంతర కవరేజీని పొందవచ్చని పేర్కొంటున్నారు. అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని చెబుతున్నారు.
పెట్టుబడులను ప్లాన్ చేయడం
పెట్టుబడులు ఉన్నత లక్ష్యాలతో ఉద్దేశపూర్వకంగా చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీమా పథకాలు అంటే కేవలం పన్నులను ఆదా చేయడానికి మీరు చేసేవి కావు. ప్రతి యువకుడు ఆర్థిక లక్ష్యాలను మ్యాప్ చేయడం ద్వారా బీమా పాలసీలను ప్రారంభించాలని చెబుతున్నారు. అత్యవసర నిధిని నిర్మించడం వంటి స్వల్పకాలిక, వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడం వంటి మధ్యకాలిక లేదా పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక. లక్ష్యాలను నిర్వచించిన తర్వాత సరైన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. బీమాతో పాటు పీపీఎఫ్, ఎస్ఐపీ, స్టాక్ మార్కెట్, యూలిప్ వంటి స్కీమ్స్ పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








