Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Money Withdrawal : కరోనాతో మరణించిన వ్యక్తికి పీఎఫ్ అకౌంట్ ఉందా..! అయితే 7 లక్షలు ఉన్నట్లే..?

EPF Money Withdrawal : దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ వేలకొద్ది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

EPF Money  Withdrawal : కరోనాతో మరణించిన వ్యక్తికి పీఎఫ్ అకౌంట్ ఉందా..! అయితే 7 లక్షలు ఉన్నట్లే..?
Epf Money
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2021 | 5:19 PM

EPF Money Withdrawal : దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ వేలకొద్ది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయితే కరోనాతో మరణించిన వ్యక్తికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఆ కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే వారికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI వర్తిస్తుంది. కుటుంబ సభ్యులు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి..

కరోనాతో మరణించిన కుటుంబ సభ్యులు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడానికి ఈపీఎఫ్ ఫామ్ 20 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌తో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా అందించాలి. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పేరు, తండ్రి లేదా భర్త పేరు, సంస్థ పేరు, అడ్రస్, ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్, ఉద్యోగంలో చివరి రోజు, ఉద్యోగం మానెయ్యడానికి కారణాలను వెల్లడించాలి. దీంతో పాటు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పుట్టిన తేదీ, మ్యారిటల్ స్టేటస్ లంటి వివరాలు రాయాలి. ఇక ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తులు కూడా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసే వ్యక్తి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, జెండర్, వయస్సు, మారిటల్ స్టేటస్, చనిపోయిన వ్యక్తితో ఉన్న సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి.

క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పొందడానికి క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

Telangana Lockdown : ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్‌ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు

అతడిది ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం.. 39 మంది భార్యలు.. మొత్తం సభ్యులు ఎంతమందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..