AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buy a Fastag: పేటీఎం ఫాస్టాగ్ ఉందా? కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిందే..!

తాజాగా ఎన్‌హెచ్ఏఐ ఫాస్టాగ్ జారీ చేసే వారి నవీకరించబడిన జాబితాను విడుదల చేసింది. కార్ ఓనర్‌లకు ఫాస్ట్‌ట్యాగ్‌లను అందించడానికి అర్హత కలిగిన 39 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నవీకరించబడిన జాబితాలో ఉన్నాయి. పేటీఎంంపేమెంట్స్ బ్యాంక్ గడువును ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫాస్టాగ్స్ పరస్పరం మార్చుకోలేమని దాని ఎఫ్ఏక్యూలో పేర్కొంది.

Buy a Fastag: పేటీఎం ఫాస్టాగ్ ఉందా? కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిందే..!
Fastag
Nikhil
|

Updated on: Mar 15, 2024 | 4:00 PM

Share

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను మూసేయాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించిన తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తన ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే ఎన్‌బీఎఫ్‌సీల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించింది. తాజాగా ఎన్‌హెచ్ఏఐ ఫాస్టాగ్ జారీ చేసే వారి నవీకరించబడిన జాబితాను విడుదల చేసింది. కార్ ఓనర్‌లకు ఫాస్ట్‌ట్యాగ్‌లను అందించడానికి అర్హత కలిగిన 39 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు నవీకరించబడిన జాబితాలో ఉన్నాయి. పేటీఎంంపేమెంట్స్ బ్యాంక్ గడువును ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫాస్టాగ్స్ పరస్పరం మార్చుకోలేమని దాని ఎఫ్ఏక్యూలో పేర్కొంది. కస్టమర్‌లు తమ ఫాస్టాగ్ ఖాతాలను పీపీబీఎల్‌తో మూసివేసి, వాపసు కోసం దరఖాస్తు చేసుకోవాలి. వారు మరొక బ్యాంకు నుండి కొత్త ఫాస్టాగ్‌ని పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ కొనుగోలుకు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం. 

ఎన్‌హెచ్ఏఐ ఆమోదించిన బ్యాంకులివే

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్, డోంబివిలి నగరి సహకార్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జే అండ్ కే బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్, లివ్ క్విక్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ది జల్గావ్ పీపుల్స్ కో-ఆప్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త్రిసూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, యస్ బ్యాంక్.

ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తొలగించిన తర్వాత పీపీబీఎల్ నుంచి మునుపు ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేసిన చాలా మంది వాహన యజమానులు ఇప్పుడు ఏదైనా ఇతర జారీ చేసే బ్యాంకు నుండి ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, వారి ఖాతాలో బ్యాలెన్స్ ఉండే వరకు వారు ఇప్పటికే ఉన్న పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఇకపై పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా టాపింగ్-అప్‌లు అనుమతించమని ఎన్‌హెచ్ఏఐ, ఆర్‌బీఐ ప్రకటించాయి. ఫలితంగా పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు మరొక అధీకృత బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి