AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sale: ఫ్రీడమ్‌ సేల్‌లో ప్రజలు ఎక్కువగా ఏం కొనుగోలు చేశారో తెలుసా.?

ఫ్రీడమ్‌ సేల్‌లో ఈ ఏడాది వినియోగదారులు గతేడాదితో పోల్చితే భారీగా కొనుగోళ్లు చేశారని ఓ నివేదికలో తేలింది. వివిధ బ్రాండ్లపై 5 నుంచి 10 శాతం వరకు అమ్మకాలు పెరిగాయని నివేదిక చెబతోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లోని కస్టమర్‌లు ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు...

Sale: ఫ్రీడమ్‌ సేల్‌లో ప్రజలు ఎక్కువగా ఏం కొనుగోలు చేశారో తెలుసా.?
Online Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 16, 2024 | 4:26 PM

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు సేల్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు విజయ్‌ సేల్‌ వంటి సంస్థలు కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందించాయి. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు అన్ని రకాల గృహోపకరణాల వస్తువులపై భారీ సేల్స్‌ను అందించాయి. కాగా ప్రస్తుతం సేల్స్‌ ముగిశాయి. మరి ఈ ఫ్రీడమ్‌ సేల్‌లో ప్రజలు ఎక్కువగా ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు.? గతేడాదితో పోల్చితే ఈసారి అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రీడమ్‌ సేల్‌లో ఈ ఏడాది వినియోగదారులు గతేడాదితో పోల్చితే భారీగా కొనుగోళ్లు చేశారని ఓ నివేదికలో తేలింది. వివిధ బ్రాండ్లపై 5 నుంచి 10 శాతం వరకు అమ్మకాలు పెరిగాయని నివేదిక చెబతోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లోని కస్టమర్‌లు ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గినట్లు తేలింది. అయితే మొత్తం మీద మాత్రం గతేడాదితో పోల్చితే అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ విభాగాల్లో రికవరీ అమ్మకాలు పెరగడానికి కారణంగా నిలిచాయని నివేదిక చెబతోంది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ స్టోర్‌ విజయ్‌ సేల్స్‌కు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు ఈ సేల్స్‌లో భాగంగా 5 నుంచి 10 శాతం వరకు విక్రయాలు పెరుగుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. అయితే ఈ పెరుగుదల కేవలం మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌ కేటగిరీల్లో మాత్రమే వృద్ధి చెందనున్నట్లు అంచనా వేయనున్నారు. రిటైల్ పరిశ్రమతో అనుసంధానించిన కంపెనీలు ఈ సేల్‌లో ప్రయోజం పొందాయని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ అమ్మకాలు పెరగనున్నట్లు భావిస్తున్నారు. ఇది భారత్‌లో మూడవ అతిపెద్ద విక్రయ సీజన్‌గా పరిగణిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఫ్రీడమ్‌ సేల్‌ తర్వాత అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. కేవలం ఈ కామర్స్‌ సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లను ఈ వృద్ధి కనిపించే అవకాశాలు ఉండనున్నాయని భావిస్తున్నారు. దీనికి కారణం రానున్న రోజుల్లో దేశంలో పండగు సీజన్‌ మొదలు కానుండడమే. దసరా, ఆ తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగల నేపథ్యంలో ఈ కామర్స్‌ సంస్థలు ఆఫర్లు అందిచడమే అని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..