Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Battery: ఎలక్ట్రిక్ వాహన రంగానికి ‘ఓలా’ బూస్ట్.. కొత్త బ్యాటరీతో ఇక పరుగులే.. 

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు సంబంధించి బ్యాటరీలను సాంకేతికంగా డెవలప్ చేయడమే ఏసీసీ పీఎల్ఐ పథకం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమల అంచనాల ప్రకారం ఎలక్ట్రిక్ టూ వీలర్ ధరలో బ్యాటరీ ధర 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. దేశంలో బ్యాటరీ సెల్స్ ను తయారు చేయడం ద్వారా ఈవీల ధర గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

Bharat Battery: ఎలక్ట్రిక్ వాహన రంగానికి 'ఓలా' బూస్ట్.. కొత్త బ్యాటరీతో ఇక పరుగులే.. 
Ola Electric
Follow us
Madhu

|

Updated on: Aug 16, 2024 | 4:24 PM

ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గణనీయమైన మార్పు మొదలైంది. కొత్తగా వచ్చిన ఆవిష్కరణతో ఆ రంగానికి ప్రజలు మరింత చేరువయ్యే అవకాశం లభించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ భారత్ సెల్ పేరుతో అద్భుతమైన లిథియం సెల్ బ్యాటరీని విడుదల చేసింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ బ్యాటరీ ఎలక్ట్రిక్ మొబిలిటీ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా చార్జింగ్ కు సంబంధించి వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

భారత్ బ్యాటరీ ఆవిష్కరణ..

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఇటీవల భారత్ బ్యాటరీ – స్వదేవీ 4680 సెల్ ను ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీకి సంబంధించి దాదాపు 70కి పైగా పేటెంట్లను క్లయిమ్ చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ తాము సాంకేతికతను దిగుమతి చేసుకోలేదని, తామే నిర్మించామని వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ సంకల్ప్ 2024 ఈవెంట్‌లో ఆయన కంపెనీ ప్రణాళికను వివరించారు. దశల వారీ విధానంలో భాగంగా 2024లో 5జీడబ్ల్యూహెచ్(గిగా వాట్ అవర్) సెల్ తయారీతో ప్రారంభమవుతుంది. 2026 నాటికి 20జీడబ్ల్యూహెచ్ వరకూ పెంచుతారు. 2030 నాటికి 100జీడబ్ల్యూహెచ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 ఏప్రిల్ నాటికి 4680 సెల్‌ను దాని ఉత్పత్తుల్లోకి చేర్చడం ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా..

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ నుంచి విడుదల అయిన ఈవీలకు మంచి ఆదరణ ఉంది. ఈ సంస్థ పీఎల్ఐ పథకం కింద కేటాయించిన 50జీడబ్ల్యూహెచ్ లో 20జీడబ్ల్యూహెచ్ ను అందించింది. తర్వాత స్థానాలలో ఏసీసీ ఎనర్జీ స్టోరేజ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ ఉన్నాయి. ఓలా కంపెనీ ఇప్పటికే దాదాపు 10 వేల సెల్‌ల పైలట్ ఉత్పత్తిని పూర్తి చేసినట్లు సమాచారం.

స్వదేశీ టెక్నాలజీ..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు సంబంధించి బ్యాటరీలను సాంకేతికంగా డెవలప్ చేయడమే ఏసీసీ పీఎల్ఐ పథకం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమల అంచనాల ప్రకారం ఎలక్ట్రిక్ టూ వీలర్ ధరలో బ్యాటరీ ధర 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. దేశంలో బ్యాటరీ సెల్స్ ను తయారు చేయడం ద్వారా ఈవీల ధర గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

భారత్ సెల్ లక్షణాలు..

ఓలా కంపెనీ తయారు చేసిన భారత్ బ్యాటర్ సెల్ కు అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తున్న 2170 సెల్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తి సాంద్రతను అందిస్తోంది. అలాగే వేగవంతంగా చార్జింగ్ అవుతుంది. తద్వారా వినియోగదారులు సౌకర్యవంతమైన సేవలు అందుతాయి.

తమిళనాడులో..

తమిళనాడులోని కృష్ణగిరిలో సంస్థ కు చెందిన గిగా ఫ్యాక్టరీని దశల వారీగా నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 లో 5జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ సెల్ అభివృద్ధి దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు కొత్త దశను తీసుకువస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో గణనీయమైన వాటాను కైవసం చేసుకోవడానికి ఓలా ఎలక్ట్రిక్‌కు స్థానం కల్పిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఎస్ వన్, ఎస్ వన్ ప్రోమోడళ్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో దూసుకుపోతోంది.

ఈవీల ధరలు తగ్గే అవకాశం..

ప్రస్తుతం మార్కెట్ లో 2170 బ్యాటరీదే ఆధిపత్యం. ఓలా రూపొందించిన భారత్ సెల్ 4680 దాని స్థానాన్ని భర్తీ చేయనుంది. కొత్త బ్యాటరీ ద్వారా వాహనం ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది. తక్కువ సమయంలో చార్జింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. స్వదేశీ టెక్నాలజీతోనే బ్యాటరీ తయారవుతుంది కాబట్టి ధర కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?