Gold Price: త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?

బంగారం.. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లలో అయితే బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. భారతీయ హిందూ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బడ్జెట్‌ సందర్భంగా ఒక్కసారి దిగి వచ్చిన బంగారం ధరలు.. త్వరలో భారీగా పెరిగే అ..

Gold Price: త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?
Gold And Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2024 | 6:57 PM

బంగారం.. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లలో అయితే బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. భారతీయ హిందూ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బడ్జెట్‌ సందర్భంగా ఒక్కసారి దిగి వచ్చిన బంగారం ధరలు.. త్వరలో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండిపై ప్రస్తుతం ఉన్న 3 శాతం జీఎస్టీ రేటును ప్రభుత్వం 5 శాతానికి పెంచవచ్చు. అంతకుముందు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం బంగారు కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో పాటు అగ్రి ఇన్‌ఫ్రా అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) డ్యూటీని 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం బంగారంపై 3 శాతం జీఎస్టీ. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు బంగారంపై మొత్తం పన్ను 9 శాతం. ఇది గతంలో 18.5 శాతం. అదేవిధంగా వెండిపై ప్రభావవంతమైన పన్ను రేటు కూడా 9 శాతానికి తగ్గించారు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!

జీఎస్టీ పెరగవచ్చు:

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కస్టమ్స్ సుంకం తగ్గింపు జీఎస్టీ రేటు పెరుగుదలకు పెద్ద సంకేతం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో జీఎస్టీ రేట్లను సరళీకృతం చేయడం, హేతుబద్ధం చేయడం గురించి ప్రస్తావించారు. జీఎస్టీ రేట్లు 3 శాతం నుంచి 5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. బంగారం, వెండిపై ప్రభుత్వం జీఎస్టీని 5 శాతానికి పెంచే అవకాశం ఉందని కేడియా కమోడిటీస్ డైరెక్టర్ అజయ్ కేడియా తెలిపారు. కాగా కస్టమ్స్ సుంకం తగ్గింపు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న బంగారం స్మగ్లింగ్‌పై సానుకూల ప్రభావం చూపనుంది. జీఎస్టీ రేటు పెంపు వల్ల ఆదాయ నష్టంలో కొంత భాగాన్ని భర్తీ చేయవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది:

జీఎస్టీ రేట్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వాలకు శుభవార్త.. ఎందుకంటే పెరిగిన రేట్లు కేంద్ర పన్ను ఆదాయంలో వారి వాటా కంటే ఎక్కువ పన్ను రాబడిని అందిస్తాయి. ఇంకా సెస్, సర్‌ఛార్జ్ రాబడి రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవడం ఉండదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో భారతదేశం కోసం మాజీ ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను ఆదాయంలో ఎక్కువ వాటాను పొందుతాయి. అందుకే వారు స్మగ్లింగ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపవచ్చు.

ఇది కూడా చదవండి: Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి.. లేకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి