AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Bonus: దీపావళి ఇచ్చే బోనస్‌లపై ట్యాక్స్‌ ఉంటుందా? పన్ను నియమాలు తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు!

Diwali Bonus Tax Rules: ఈ దీపావళికి మీకు నగదు బోనస్ అందితే మీరు దానిని వచ్చే ఏడాది మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో వెల్లడించాలి. దానిని నివేదించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు. ముఖ్యంగా మీకు లక్ష లేదా రెండు లక్షల రూపాయల వంటి పెద్ద నగదు బోనస్ అందితే మీరు దానిని బహిర్గతం చేయాలి.

Diwali Bonus: దీపావళి ఇచ్చే బోనస్‌లపై ట్యాక్స్‌ ఉంటుందా? పన్ను నియమాలు తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు!
Subhash Goud
|

Updated on: Oct 15, 2025 | 1:45 PM

Share

Diwali Bonus Tax Rules: దీపావళి బోనస్ పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. చాలా మందికి ఇప్పటికే దీపావళి బోనస్ అంది ఉండవచ్చు. మరికొందరికి రాబోయే 1-2 రోజుల్లో అది అందుతుంది. ప్రశ్న ఏమిటంటే దీపావళి బోనస్ పన్ను రహితమా?

5,000 వరకు బహుమతులపై పన్ను లేదు:

దీపావళి బహుమతులన్నీ పన్ను రహితమైనవి కావని పన్ను నిపుణులు అంటున్నారు. వాటిని సరిగ్గా నివేదించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు. బహుమతి విలువ రూ.5,000 మించకపోతే యజమాని నుండి అందుకున్న బహుమతులు ఆదాయపు పన్నుకు లోబడి ఉండవు. అంటే సాధారణంగా ఈ మొత్తం వరకు ఖరీదు చేసే స్వీట్ల బాక్స్‌, చిన్న గాడ్జెట్ లేదా పండుగ దుస్తులు వంటి వస్తువులపై పన్ను ఉండదు.

ఇది కూడా చదవండి: Indias Wealthiest Village: ఇది మన దేశంలో అత్యంత సంపన్న గ్రామం.. లగ్జరీ కార్లు, బ్యాంకు డిపాజిట్లు రూ. 1,000 కోట్లు.. ఇక్కడ వారిదే ఆధిపత్యం

ఇవి కూడా చదవండి

5000 దాటిన బహుమతులపై పన్ను:

మీ యజమాని నుండి దీపావళి బహుమతి రూ.5,000 కంటే ఎక్కువ విలువైనది. అయితే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, బంగారం లేదా వెండి ఆభరణాలు లేదా రూ.5,000 కంటే ఎక్కువ విలువైన ఏదైనా ఇతర ఖరీదైన బహుమతిపై పన్ను విధిస్తుంది. మీరు రూ.5,000 కంటే ఎక్కువ విలువైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బహుమతులను స్వీకరిస్తే, మీరు వాటి విలువను లెక్కించి మీ ఆదాయానికి జోడించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు అంటున్నారు. ఈ బహుమతులు మీ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.

నగదు బోనస్ పన్ను:

దీపావళి నాడు మీ యజమాని నుండి మీకు నగదు బోనస్ అందితే, అది మీ జీతంలో భాగంగా పరిగణిస్తారని, దానిపై మీకు పన్ను విధిస్తారని నిపుణులు అంటున్నారు. దీనిని ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీపావళి నాడు మీకు రూ. 30,000 బోనస్ అందుతుందని అనుకుందాం. ఇది మీ వార్షిక ఆదాయానికి యాడ్‌ అవుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. దీపావళి నాడు అందుకున్న నగదు బోనస్‌లు పన్ను నుండి మినహాయింపు ఉండదు.

అధిక మొత్తాల బోనస్‌లను నివేదించడం తప్పనిసరి:

ఈ దీపావళికి మీకు నగదు బోనస్ అందితే మీరు దానిని వచ్చే ఏడాది మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో వెల్లడించాలి. దానిని నివేదించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు. ముఖ్యంగా మీకు లక్ష లేదా రెండు లక్షల రూపాయల వంటి పెద్ద నగదు బోనస్ అందితే మీరు దానిని బహిర్గతం చేయాలి. అలా చేయకపోతే ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు.

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..