UPI Free: దుకాణదారులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది పాటు UPI ఉచితం

UPI Free: చిన్న వ్యాపారులు, కిరాణాషాపు యజమానులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ప్రభుత్వం మరో ఏడాది పాటు

UPI Free: దుకాణదారులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది పాటు UPI ఉచితం
UPI Frauds
Follow us
uppula Raju

|

Updated on: Feb 02, 2022 | 3:22 PM

UPI Free: చిన్న వ్యాపారులు, కిరాణాషాపు యజమానులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ప్రభుత్వం మరో ఏడాది పాటు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు ఉచితంగా అందిస్తుంది. డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడంతో చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగా లభిస్తాయి. గత సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో కూడా కేంద్ర ప్రభుత్వం UPI, రూపే మర్చంట్ లావాదేవీలపై బ్యాంకులకు పరిహారం అందించింది. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) అనేది డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి దుకాణాలు బ్యాంకులకు చెల్లించే రుసుము. ఈ చెల్లింపులను సులభతరం చేసే ఫిన్‌టెక్‌లు ఈ లావాదేవీలపై ఎటువంటి ఆదాయాన్ని పొందవు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను మరింత పెంచడం కోసం ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. జీరో MDR వల్ల చిన్న వ్యాపారులు, కిరాణా షాపుదారులకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

యూపీఐని యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ అంటారు. ఇది ఆర్‌బీఐ నియంత్రణ సంస్థ అయిన నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేత తక్షణ బదిలీ కోసం అభివృద్ధి చేయబడింది. యూపీఐ IMPS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పని చేస్తుంది. అయినప్పటికీ దీని ద్వారా ఐఎంపీఎస్‌ను మించి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఏవైనా రెండు బ్యాంక్‌ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీ చేయడానికి యూపీఐ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒకే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకునేందుకు యూపీఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండు ప్లాట్‌ ఫామ్స్‌లోనూ పని చేస్తుంది.

తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?