Investment Fraud: నెలకు రూ.21 వేల పెట్టుబడితో రూ.15 లక్షల రాబడి.. అసలు నిజం తెలుసా?
భారతదేశంలోని ప్రజలు చాలా మంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు కొన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఇలాంటి పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే గత కొద్దిరోజుగా నెలకు రూ.21 వేల పెట్టుబడితో రూ.15 లక్షల రాబడి అంటూ ఓ పథకం వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనా? వంటి విషయాలను తెలుసుకుందాం.

ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి కేంద్రం ఓ పెట్టుబడి పథకం ప్రవేశపెట్టిందని ఓ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ పెట్టుబడిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నారని నెలకు రూ.21,000 పెట్టుబడితో రూ.15 లక్షల వరకు రాబడి వస్తుందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త పూర్తిగా తప్పు అని పీఐబీ పేర్కొంది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వ్యక్తులు తమ జీవితాలను మార్చుకోవచ్చని సీతారామన్ వీడియోలో చెబుతున్నట్లు తెలుస్తోంది. అధునాతన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి నారాయణ మూర్తి చేసిన సహకారాన్ని కూడా వీడియోలో ఆమె ప్రస్తావించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వాదనను తోసిపుచ్చింది. పీఐబీ ఈ వీడియో నకిలీదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆర్థిక మంత్రి లేదా భారత ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రారంభించలేదని సేర్కొంది. అలాంటి అనుమానాస్పద పెట్టుబడి పథకాలకు ఆకర్షితులు కావద్దని పేర్కొంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వీడియోను అల్ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమంగా మార్చారని పీఐబీ పేర్కొంది. ప్రభుత్వానికి సంబంధించిన తప్పుదారి పట్టించే వార్తలను ధ్రువీకరించాలనుకునే వారికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం అందిస్తుంది. వ్యక్తులు స్క్రీన్‌షాట్‌లు, ట్వీట్‌లు, ఫేస్‌బుక్ పోస్ట్‌లు లేదా అనుమానాస్పద కంటెంట్‌కు సంబంధించిన యూఆర్ఎల్‌లను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..