Diwali Sales: పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులదే అగ్రస్థానం..
కూరగాయలు, పప్పుధాన్యాలు, చింతపండు, వంటనూనెలు.. ఇలా అన్నీ వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
కూరగాయలు, పప్పుధాన్యాలు, చింతపండు, వంటనూనెలు.. ఇలా అన్నీ వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రోజురోజుకీ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ధరలకు సంబంధించి కేంద్రం ఇటీవల కొంత ఉపశమనం కలిగించినా.. ఇప్పటికీ బండి తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపరించింది.
పెరుగుతున్న ధరలతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంతమేర ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అయితే ఆశ్చర్యకరంగా బంగారు, వెండి ఆభరణాల కొనుగోళ్లు, విక్రయాలు రికార్డులు సృష్టించాయి. మొత్తం 1.25 లక్షల కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో రూ. 9,000 కోట్ల బంగారు ఆభరణాలు, వెండి సామాగ్రి భారీ అమ్మకాలు కాగా రూ. 15,000 కోట్ల విలువైన వస్తువుల ప్యాకేజింగ్ సేవలున్నాయి. ముఖ్యంగా దీపావళి సందర్భంగా మిడ్-టు-ప్రీమియం ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ప్రతి సంవత్సరం లాగే ఈ దీపావళి నాడు కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయాలు భారీ ఎత్తున జరిగాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు, టీవీలు, కిచెన్ ఉపకరణాలు, రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్లు భారీగా అమ్ముడుపోయాయి. ఈ దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ అండఖ ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో మొబైల్ ఫోన్‌ల కోసం అత్యధిక సగటు అమ్మకపు ధర నమోదైందని కన్సల్టెన్సీ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లోని సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రచీర్ సింగ్ మాట్లాడుతూ, ‘పండుగ సీజన్‌లో రూ. 30,000 కంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరిగిందన్నారు. గత సంవత్సరం కంటే మధ్య నుండి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 1.8 రెట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇక భారతదేశంలోని BSH చరిత్రలో సేల్‌షేవ్ అత్యుత్తమ దీపావళిని నమోదు చేసిందని Bosch ప్రీమియం ఎలక్ట్రానిక్ ఉపకరణాల మేజర్ ఒకరు చెప్పారు.” గత దీపావళి నుంచి మేం వాషింగ్ మెషీన్ ఉత్పత్తుల్లో 28-30% వృద్ధిని సాధించాం. అదేవిధంగా డ్రైయర్ కాంబోలు, మిక్సర్ గ్రైండర్లు, డిష్‌వాషర్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇక గోద్రెజ్ అప్లయెన్సెస్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్‌ల వంటి ప్రీమియం సెగ్మెంట్‌ల విలువ పెరుగుదల కారణంగా 28% జంప్ నమోదు చేసిందని వెల్లడించారు.
ఇక ఈ పండుగ సీజన్‌లో ప్యాసింజర్ వాహనాల రిటైల్‌లు 33 శాతం తగ్గాయని, గత 30-34 రోజుల్లో ద్విచక్ర వాహనాల రిటైల్‌లు 15 శాతం తగ్గాయని, గత పండుగ సీజన్‌లో 4.5 లక్షల కార్లు విక్రయించగా, ఈ సంవత్సరం సుమారుగా 3 లక్షల కార్లు అమ్ముడయ్యాయని FADA ప్రెసిడెంట్ వింకేష్ గులాటి చెప్పారు.