MULTIPLEXES: మల్టీఫ్లెక్స్‌లకు మళ్లీ వెలుగులు.. అమాంతం పెరిగిన షేర్లు..

దిల్లీకి చెందిన మాణిక్‌ భార్గవ్‌కు సినిమాలు చూడడమంటే ఎంతో ఆసక్తి. అది కూడా థియేటర్లకు వెళ్లి పెద్ద తెరపైనే చిత్రాలు చూస్తాడు. అయితే అనుకోకుండా క

MULTIPLEXES:  మల్టీఫ్లెక్స్‌లకు మళ్లీ వెలుగులు.. అమాంతం పెరిగిన షేర్లు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2021 | 5:37 PM

దిల్లీకి చెందిన మాణిక్‌ భార్గవ్‌కు సినిమాలు చూడడమంటే ఎంతో ఆసక్తి. అది కూడా థియేటర్లకు వెళ్లి పెద్ద తెరపైనే చిత్రాలు చూస్తాడు. అయితే అనుకోకుండా కరోనా వైరస్‌ అతని సినిమా ఆసక్తికి అడ్డుకట్ట వేసింది. పూర్తిగా ఇంటికే పరిమితం చేసింది. ఓటీటీలతో కాలక్షేపం చేశాడు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ టికెట్‌ కొనుక్కోని అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవంశీ’ సినిమా చూశాడు. మళ్లీ బిగ్‌ స్ర్కీన్‌పై సినిమాను చూసి ఎంతో సంతోషంగా ఫీలయ్యాడు. ఇప్పుడు అందరూ ఇలానే ఫీలవుతున్నారు.

ఈ సినిమా కారణంగా పీవీఆర్ సినిమా కంపెనీ షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. మల్టీప్లెక్స్‌లను కలిగి ఉన్న మరో కంపెనీ ఐనాక్స్ షేర్ల ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 18 నెలలకు పైగా మూతపడినప్పటికీ మల్టీప్లెక్స్ స్టాక్స్ ఎలా పెరిగాయని చాలామందికి సందేహం రావచ్చు. అయితే ‘సూర్యవంశీ మొదటి వారాంతంలో ఈ సినిమా రూ. 90 కోట్లను వసూలు చేసింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు కేవలం 50% కెపాసిటీతో సినిమా హాళ్లను నడిపిస్తున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్ లేకపోయి ఉండి, పూర్తి సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను నడిపించి ఉంటే రెట్టింపు వసూళ్లు నమోదయ్యేవి. ‘ సూర్యవంశీ’ సినిమా ఏడాది క్రితమే విడుదలవ్సాల్సి ఉంది. ఓటీటీ ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే దర్శకుడు రోహిత్ శెట్టి మాత్రం సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇన్ని రోజులు వేచి చూసినందుకు సినిమా యూనిట్‌కు మంచి లాభాలే వచ్చాయి. ఈ సినిమాను చూసి మరెన్నో సినిమాలు థియేటర్లలోకి క్యూ కట్టనున్నాయి. దీంతో మల్టీప్లెక్స్‌లు వర్సెస్‌ ఓటీటీలపై చర్చ ముగిసిపోవచ్చు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పెద్ద స్క్రీన్‌పైనే సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. అయితే కోవిడ్ ప్రజలను సినిమాలకు రాకుండా అడ్డుకుంది. దీంతో వారు OTTలో వినోదాన్ని పొందారు. ప్రజలు మళ్లీ పెద్ద సినిమాలను పెద్ద తెరపై చూసేందుకు వస్తారని ఆశిస్తున్నాం’ అని పీవీఆర్ చైర్మన్ అజయ్ బిజిలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.