Post Office Saving Scheme: రిస్క్ లేకుండా మంచి రాబడి పొందలనుకుంటున్నారా.. అయితే ఈ స్కీమ్‌ను పరిశీలించండి..
ఈ రోజుల్లో చాలా మంది ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పెట్టుబడికి మంచి ఎంపిక అవుతుంది....
ఈ రోజుల్లో చాలా మంది ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూడా రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం మంచి ఎంపిక అవుతుంది. ఈ పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాల ప్రత్యేకత ఏమిటంటే గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఉండదు అదే సమయంలో ఈ పథకంలో బహుళ ఖాతాలను తెరవవచ్చు. అంతేకాకుండా, ఎన్‌ఎస్‌సీలో డిపాజిట్లపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం వడ్డీ రేటు, మెచ్యూరిటీ:
పోస్ట్ ఆఫీస్ యొక్క నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ప్రస్తుతం సంవత్సరానికి 6.8 శాతం వడ్డీని అందిస్తోంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన ఇస్తారు. మెచ్యూరిటీ తర్వాత మాత్రమే చెల్లిస్తారు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. పోస్టాఫీసు వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, మీరు ఎన్‌ఎస్‌సీలో రూ. 1000 పెట్టుబడి పెడితే, వచ్చే 5 సంవత్సరాల తర్వాత మీకు రూ.1389.49 వస్తాయి. మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై మొత్తం రూ. 6,94,746 వస్తాయి. ఇందులో రూ.1,94,746 వడ్డీ వస్తుంది. అందుబాటులో ఉన్న ఏదైనా పోస్టాఫీసు నుండి మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)లో పెట్టుబడి పెట్టవచ్చు.
పథకంలో కింద కనీసం రూ.1000తో ఖాతా తెరుచుకోవచ్చు. అదే సమయంలో ఇందులో పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు. ఇందులో పెట్టుబడి పూర్తిగా సురక్షితం. మార్కెట్ రిస్క్ దానిపై ప్రభావం చూపదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి ఎవరు అర్హులు
దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసు శాఖల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవవచ్చు. పెద్దలు ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. ఇందులో ఉమ్మడి ఖాతా కాకుండా, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు కూడా ఖాతాను తెరవవచ్చు.
Read Also.. Mutation: మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..