AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business: సేఫ్టీ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్‌ స్కోర్‌.. 5 స్టార్‌ రేటింగ్‌ సొంతం..

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సంస్థ ఆగస్టులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన..

Business: సేఫ్టీ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 టాప్‌ స్కోర్‌.. 5 స్టార్‌ రేటింగ్‌ సొంతం..
Basha Shek
|

Updated on: Nov 10, 2021 | 6:44 PM

Share

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సంస్థ ఆగస్టులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారును మహీంద్రా కంపెనీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వాహనదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ రెండు ఎయిర్‌ బ్యాగులతో పాటు సైడ్‌- బాడీ ఎయిర్‌ బ్యాగులు, సైడ్‌ హెడ్‌ కర్టెన్‌ ఎయిర్‌ బ్యాగులు, ఏబీఎస్‌ బ్రేకులు, ఎలక్ర్టానిక్స్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ ఫీచర్స్‌తో ఈ కారును తయారుచేసింది. ఈ ప్రమాణాలకు తగ్గట్లే తాజాగా గ్లోబల్‌ ఎన్‌సీపీ *SaferCorForIndia పేరులో నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫైవ్‌ స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సంపాదించింది. అదేవిధంగా పిల్లల రక్షణకు సంబంధించి 4 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

ఇండియాలో మొదటి కంపెనీగా… పెద్దలు, పిల్లల భద్రతకు సంబంధించి మహీంద్రా కొత్త కారు టాప్‌ స్కోర్‌ సంపాదించింది. అలాగే భారతదేశంలో మొదటిసారిగా అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీగా మహీంద్రా నిలిచింది. ఈ లైఫ్‌- సేవింగ్‌ టెక్నాలజీని తీసుకురావడం నిజంగా అభినందనీయం’ అని గ్లోబల్‌ ఎన్‌సీపీ సెక్రెటరీ అలెజాండ్రో పురాస్‌ చెప్పుకొచ్చారు.ప్రీ బుకింగ్స్‌ను పరంగా కూడా ఈ కారు రికార్డు సాధించింది. ఇక ఈ కారు సేల్స్‌ విక్రయానికొస్తే.. ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్‌ 7, అక్టోబర్‌ 8 రోజుల్లో మొత్తం 50వేల వెహికల్స్‌ బుకింగ్‌ జరిగినట్లు, అదేవిధంగా 14 రోజుల్లోనే 65,000 వెహికల్స్‌ బుక్‌ అయినట్లు మహీంద్రా సంస్థ తెలిపింది.

Also read:

2021 Maruti Celerio: మారుతీ సుజుకీ సంచలనం.. 1 లీటర్ పెట్రోల్‌తో అత్యధిక మైలేజ్.. మార్కెట్‌లోకి విడుదలైన 2021 సెలెరియో..!

Post Office Saving Scheme: రిస్క్ లేకుండా మంచి రాబడి పొందలనుకుంటున్నారా.. అయితే ఈ స్కీమ్‎ను పరిశీలించండి..

Nykaa IPO listing: స్టాక్‌మార్కెట్లో బంపర్‌ లిస్టింగ్‌.. భారీ వేగంతో దూసుకుపోతున్న బ్యూటీ ప్రొడక్ట్స్ ఇ-కామర్స్ కంపెనీ..