AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutation: మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

సమాజంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు చాలా జరుగుతుంటాయి. ఒకప్పుడు నిజయతీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. అందుకే ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి...

Mutation: మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
Mutation
Srinivas Chekkilla
|

Updated on: Nov 10, 2021 | 4:27 PM

Share

సమాజంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు చాలా జరుగుతుంటాయి. ఒకప్పుడు నిజయతీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. అందుకే ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అన్ని పరిశీలించిన తర్వాతే ఆస్తులు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ఆస్తులను తప్పకుండా మ్యుటేషన్ చేయించుకోవాలి. లేకుంటే భష్యత్తులో ఇబ్బందుల తలెత్తే అవకాశం ఉంటుంది.

ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లోని ఫ్రీహోల్డ్ కాలనీలో గజే సింగ్ అనే వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. ఇల్లు కట్టడం ప్రారంభించాడు. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ ప్లాట్ తమదంటూ.. ఇద్దరూ రిజిస్ట్రేషన్ డీడ్‌ను సమర్పించడంతో వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఒకే ప్లాట్‌ను మూడు పార్టీలు నమోదు చేసుకోవడం ఎలా సాధ్యం? వాస్తవానికి, గజే సింగ్ ప్లాట్‌ను రిజిస్టర్ చేసుకున్నాడు కానీ మ్యుటేషన్ చేయించుకోలేదు. అందుకే యాజమాన్య హక్కులు పొందలేకపోయాడు. గజే సింగ్ ఒక్కడే కాదు.. ఈ చిన్న పొరపాటు వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారు.

మీరు ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత మ్యుటేషన్ ప్రక్రియన పూర్తి అయిందో లేదో చూసుకోవాలి. మ్యుటేషన్ అంటే ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో కొన్న వారి పేరు నమోదు చేస్తారు. ఆస్తి ఒక వ్యక్తి నుంచి మరొకరికి బదిలీ చేశారని ఇది చట్టపరమైన రుజువుగా ఉపయోగపడుతుంది. మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తి ఆస్తిపై చట్టపరమైన అధికారాన్ని పొందుతాడు. కాబట్టి ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత మ్యుటేషన్ చేయడం చాలా ముఖ్యం. ఆస్తి మ్యుటేషన్ తర్వాత చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి. మ్యుటేషన్ పూర్తయిన తర్వాత ఆస్తి మాజీ యజమాని ఎవరైనా మోసపూరిత పద్ధతిలో భూమిని విక్రయిస్తే మీరు న్యాయ పోరాటం చేయవచ్చు. మీరు ఏదైనా భూమిని కొనుగోలు చేసి, దానిని ప్రభుత్వ ఏజెన్సీ స్వాధీనం చేసుకున్నట్లయితే, మ్యుటేషన్ చేయకపోతే మీకు ఎలాంటి పరిహారం లభించదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా మ్యుటేషన్ లేకుండా భూమిపై ఎటువంటి రుణాలు ఇవ్వవు.

ఒకే ఖస్రాలో ఎక్కువ విస్తీర్ణంలో భూమిని కవర్ చేయవచ్చని రియల్‌ ఎస్టేట్‌ నిపుణుడు, హోమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు ప్రదీప్‌ మిశ్రా అన్నారు. దీని ద్వారా ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా వాస్తవ విస్తీర్ణం ఆధారంగానే మ్యుటేషన్ జరుగుతుందని తెలిపారు. మ్యుటేషన్ తర్వాత మాత్రమే ప్లాట్ చట్టబద్ధంగా సొంతం అవుతుందని చెప్పారు. ప్లాట్లు, భూమి మొదలైన వాటి రిజిస్ట్రేషన్ ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, కానీ మ్యుటేషన్ మాత్రం ఒక్కటే ఉంటుంది.

ఏదైనా ప్లాట్లు లేదా వ్యవసాయ భూమిని కొనుగోలు చేసే ముందు ఈ భూమి అక్రమంగా ఆక్రమించబడలేదని నిర్ధారించుకోండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ న్యాయవాదితో ఆస్తి చట్టబద్ధతపై మాట్లాడండి. మ్యుటేషన్ నిర్దిష్ట సమయ పూర్తి చేసుకోవాలి. చాలా సార్లు విక్రేత చెడు ఉద్దేశంతో ఉన్నప్పుడు, అతను అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. మ్యుటేషన్ సమయంలో, డీల్‌ను చేసుకునేటప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచుకోండి.

Read Also.. Gold Vs Stock Market: స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టాలా.. బంగారంపై పెట్టుబడి పెట్టాలా.. ఏది బెటర్..