Gold Vs Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా.. బంగారంపై పెట్టుబడి పెట్టాలా.. ఏది బెటర్..
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇది ఎంత వరకు సేఫ్ అనేది చాలా మందికి తెలియదు. పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ ఒక్కటే కాకుండా బంగారంపై కూడా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు...
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇది ఎంత వరకు సేఫ్ అనేది చాలా మందికి తెలియదు. పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్ ఒక్కటే కాకుండా బంగారంపై కూడా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం, స్టాక్ మార్కెట్ ఏది మంచిదో చాలా మందికి తెలియదు.
నవంబర్ 8న వినాయక్ ఫోన్‌కు ఏకకాలంలో రెండు ముఖ్యమైన మార్కెట్ అప్‌డేట్స్ వచ్చాయి. మొదటి అప్‌డేట్ నిఫ్టీ మళ్లీ 18,000 మార్క్‌ను అధిగమిస్తుందని.. రెండో అప్‌డేట్ బంగారం ధరలు 3 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుటుందని. ఈ రెండు వార్తలు వినాయక్‌ను గందరగోళంలోకి నెట్టాయి. ఎందుకంటే అతనికి వీటిపై పూర్తిగా అవగాహన లేదు. స్టాక్ మార్కెట్ బూమ్‌తో బంగారం ధర పడిపోతుందని అతని ఆర్థిక సలహాదారు చెప్పాడు. కానీ అతనికి వచ్చిన అప్‌డేట్స్ ఆర్థిక సహాదారు చెప్పినదానికి విరుద్ధంగా ఉంది. స్టాక్ మార్కెట్‌తో పాటు బంగారం ధర పెరుగుతుంది. దీంతో వినాయక్ అయోమయంలో పడిపోయాడు. అయితే ఈ పరిణామంపై వినాయక్ ఒక్కడే అయోమయంలో పడలేదు చాలా మంది ఇలాంటి గందరగోళంలో ఉన్నారు. చాలా మంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్, బంగారం కలిసి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది? అలాంటి పరిస్థితిల్లో వారు తమ పోర్ట్‌ఫోలియోలను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం..
ముందుగా స్టాక్ మార్కెట్ బూమ్ గురించి మాట్లాడుకుందాం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన డాలర్, భారీ ఫ్యూచర్ డీల్స్ వంటి భయాలు ర్యాలీకి బలాన్ని ఇస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక సూచించింది. అక్టోబర్‌లో బంగారం ధర 1.5 శాతం పెరిగింది. భారతదేశంలో పండుగ సీజన్‌లో ఈ గ్లోబల్ ధరలు పెరిగాయి. గ్లోబల్, దేశీయ డిమాండ్ కారణంగా మార్కెట్ నిపుణులు బంగారంపై పెట్టుబడి సలహా ఇస్తున్నారు. ఇతర అసెట్ క్లాస్‌లతో పోలిస్తే బంగారం ధరలు పెద్దగా పెరగలేదని ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితిల్లో మీరు ప్రస్తుత ధరల ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేస్తే రాబడి స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ మన్నికైనదిగా ఉంటుంది. గతేడాది దేశీయ మార్కెట్‌లో బంగారం అత్యధికంగా రూ.56,200కి చేరింది. ప్రస్తుత ధర రూ.48,000 దగ్గర ఉంది. బంగారంపై విశ్వాసం పెరగడానికి స్టాక్ మార్కెట్ పెద్ద బూమ్ కూడా ఒక పెద్ద కారణం.
ప్రస్తుత స్థాయిలో మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల మంచి త్రైమాసిక ఫలితాలు, మార్కెట్లో నగదు లభ్యత, ద్రవ్యోల్బణంతో మార్కెట్లు పెరగడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పోర్ట్‌ఫోలియోను సరిచేయండి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు, కమోడిటీ మార్కెట్ నిపుణులు మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత బంగారాన్ని కలిగి ఉండాలనే దానిపై విభిన్నంగా ఉంటారు. పోర్ట్‌ఫోలియోలో 10 శాతం మాత్రమే బంగారం రూపంలో ఉంచాలని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మత్‌పాల్ అభిప్రాయపడ్డారు. అయితే బంగారం మాత్రం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అనూజ్ గుప్తా చెబుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుత స్థాయిలో రిస్క్-రివార్డ్ రేషియో బాగా లేదు. ఈ సందర్భంలో, పోర్ట్‌ఫోలియోలో 15 శాతం వరకు బంగారాన్ని కూడా ఉంచవచ్చు.
మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. లేక బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకున్నా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. ఎలాంటి సలహా, అవగాహన లేకుంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.