Dare2 Dream Awards: ‘ఆత్మనిర్భర్‌ భారత్’ లక్ష్య సాధనలో టీవీ9 సైతం.. డేర్2 డ్రీమ్ అవార్డ్స్- సీజన్ 3 అవార్డులకు నమోదు చేసుకోండిలా..

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)లు వెన్నెముక లాంటివి. తక్కువ పెట్టుబడికి తోడు ఎక్కువ ఆదాయం ఉండడంతో గత

Dare2 Dream Awards:  'ఆత్మనిర్భర్‌ భారత్' లక్ష్య సాధనలో టీవీ9 సైతం.. డేర్2 డ్రీమ్ అవార్డ్స్- సీజన్ 3 అవార్డులకు నమోదు చేసుకోండిలా..
Follow us
Basha Shek

|

Updated on: Nov 10, 2021 | 3:57 PM

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)లు వెన్నెముక లాంటివి. తక్కువ పెట్టుబడికి తోడు ఎక్కువ ఆదాయం ఉండడంతో గత కొన్నేళ్లుగా దేశంలో వీటి సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాదు వీటివల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరిగి ఉపాధి రంగం కూడా ఊపందుకుంటోంది.. మినిస్ట్రీ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం భారత దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇవి దేశ జీడీపీలో 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక భారతీయ ఎగుమతుల్లో దాదాపు 50 శాతం ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచే తయారైన ఉత్పత్తులే ఉండడం విశేషం. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ఎంఎస్‌ఎంఈ ల్లో వృద్ధి కొంత క్షీణించినా మళ్లీ ఇప్పుడు ఊపందుకోకున్నాయి.

కరోనా సంక్షోభం సమయంలో వెనకడుగు వేయకుండా, వినూత్న ఆలోచనలతో తమ వ్యాపారాలను లాభాల బాటలో నడిపించిన యువ వ్యాపారవేత్తలను సత్కరించేందుకు టీవీ9 నెట్‌వర్క్‌, SAP ఇండియా నడుంబిగించాయి. ఇందులో భాగంగా డేర్2డ్రీమ్ అవార్డ్స్- సీజన్ 3ను ప్రారంభించాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవం ద్వారా యువ వ్యాపారవేత్తల విజయ రహస్యాలు అందరికీ తెలియజేయడంతో పాటు ఆత్మనిర్భర్‌ భారత్‌ ను సాకారం చేయడమే ప్రధాన లక్ష్యం. Dare2Dream అవార్డులనేవి స్వావలంబన భారతదేశాన్ని నిర్మించే దిశగా గణనీయమైన అడుగు వేసిన దేశీయ సంస్థలు, యువ వ్యాపారవేత్తలు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సరైన వేదిక.

అవార్డు కేటగిరీలు

15 ప్రత్యేక విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నారు.

1. వార్షిక టర్నోవర్ రూ.65 నుంచి రూ.150 కోట్ల వరకు ఉన్న కంపెనీలు

2. రూ. 150 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన సెమీ- కార్పొరేట్ సంస్థలు

డిపార్ట్‌మెంట్స్‌(శాఖలు)

1. కంపెనీ ఆఫ్ ది ఇయర్ – సెక్టోరల్ అవార్డులు (ఒక్కో విభాగానికి 8- 9 అవార్డులు)

2. ఎమర్జింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్

3. సాంకేతికత సహాయంతో వ్యాపారాభివృద్ధి

స్ఫూర్తినిచ్చేలా నిలిచిన వ్యక్తులు..

1. యంగ్ బిజినెస్ లీడర్

2. మహిళా పారిశ్రామికవేత్త ఆఫ్ ది ఇయర్

3. బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

ఈ అవార్డుల ప్రదానోత్సవం భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన TV9 నెట్‌వర్క్‌ ఛానెల్స్‌, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానుంది. Dare2Dream అవార్డ్స్ సీజన్ 3 కోసం ఎంట్రీలు కొనసాగుతున్నాయి. నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 18 నవంబర్ 2021.

పాల్గొనడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి..

https://growthmattersforum.com/new-launch/dare2dream-awards/