December Alert: నేటి నుంచి పెరగనున్న అగ్గిపెట్టె ధరలు.. SBI క్రెడిట్ కార్డ్‌పై ఛార్జీ వసూల్..
డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్‌ల ఛార్జీలు, అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. మంగళవారం ఎల్‌పీజీ సిలిండర్ల ధర సమీక్షించనున్నారు. అలాగే నేటి నుంచి పీఎన్‌బీ వడ్డీ రేట్లు తగ్గుతాయి...

డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్‌ల ఛార్జీలు, అగ్గిపెట్టెల ధరలు పెరగనున్నాయి. బుధవారం ఎల్‌పీజీ సిలిండర్ల ధర సమీక్షించనున్నారు. అలాగే నేటి నుంచి పీఎన్‌బీ వడ్డీ రేట్లు తగ్గుతాయి.
SBI క్రెడిట్ కార్డ్‌పై రూ. 99 ఛార్జి
బుధవారం నుంచి SBI క్రెడిట్ కార్డ్‌తో EMIలో షాపింగ్ చేయడం ఖరీదుగై మానుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు తన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే అన్ని EMI లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులను విధిస్తుంది. అటువంటి ప్రతి కొనుగోలుపై ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 99 పన్నును ప్రత్యేకంగా చెల్లించాలి. విజయవంతంగా EMI లావాదేవీలుగా మార్చిన లావాదేవీలపై మాత్రమే ప్రాసెసింగ్ రుసుము రూ. 99 ఉండనుంది. EMI లావాదేవీ విఫలమైతే లేదా రద్దు అయితే ప్రాసెసింగ్ ఫీజు రీఫండ్ చేస్తామని SBI తెలిపింది.
హాల్‌మార్కింగ్
డిసెంబర్ 1 నుండి హాల్‌మార్కింగ్ నియమాలను కచ్చితంగా పాటించాలి. లేని పక్షంలో నగల వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. దీని ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న లేదా రిజిస్టర్ అయిన నగల వ్యాపారులు తమ దుకాణంలో ప్రతి ఆభరణంపై హాల్‌మార్క్ కలిగి ఉండాలి. ఇది కాకుండా, విక్రయించే అన్ని ఆభరణాలపై హాల్‌మార్కింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి.
పీఎన్‌బీ వడ్డీ రేట్లు తగ్గాయి
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. PNB పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు నేటి నుంచి తగ్గుతాయి. పొదుపు ఖాతా వడ్డీ రేట్లను ఏడాదికి 2.90 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించాలని పీఎన్‌బీ నిర్ణయించింది. 10 లక్షల కంటే తక్కువ ఉన్న పొదుపు ఖాతాకు వార్షిక వడ్డీ రేటు 2.80 శాతంగా ఉంటుంది. అదే సమయంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, వార్షిక వడ్డీ రేటు 2.85 శాతంగా ఉంటుంది.
పెరిగిన అగ్గిపెట్టె రేటు
నేటి నుంచి అగ్గిపెట్టెల ధరలు రెట్టింపు అవుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టెల ధర రెట్టింపు కానుంది. అగ్గిపెట్టెల పెట్టె రూ.1కి బదులుగా రూ.2 అవుతుంది. చివరిసారిగా 2007లో అగ్గిపెట్టెల ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచారు. ముడిసరుకు రేటు పెరగడంతో అగ్గిపెట్టెల ధరను పెంచాలని నిర్ణయించారు. అగ్గిపెట్టె తయారీకి 14 రకాల ముడి పదార్థాలు అవసరమని తయారీదారులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్ల ధరను ప్రతినెలా మొదటి తేదీన సమీక్షిస్తారు. కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల కొత్త రేట్లు ప్రతి నెల 1వ తేదీన జారీ చేస్తారు. ఈ రోజు కూడా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించనున్నాయి. గత నెలలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కో సిలిండర్‌పై రూ.268 వరకు పెంచాయి.
Read Also.. Gold Bonds: గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..



