యెస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్..!

యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గత రెండు రోజులుగా ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం విచారణ చేపట్టేందుకు అధికారులు రాణాకపూర్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు అధికారులు రాణాను ప్రశ్నించారు. అయితే విచారణలో సహకరించకపోవడంతో.. ఆయన్ను ఆదివారం […]

యెస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 08, 2020 | 2:15 PM

యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గత రెండు రోజులుగా ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం విచారణ చేపట్టేందుకు అధికారులు రాణాకపూర్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు అధికారులు రాణాను ప్రశ్నించారు. అయితే విచారణలో సహకరించకపోవడంతో.. ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఈరోజు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరతామని అధికారులు తెలిపారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌‌తో పాటుగా మరికొన్ని కార్పోరేట్ సంస్థలకు రుణాలు ఇచ్చిన విషయంలో సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి.. బ్యాంకులో జరిగిన అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కస్టమర్లకు యెస్‌ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. డెబిట్‌ కార్డుల ద్వారా.. అన్ని ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ.. తన అధికారిక ట్విట్టర్‌ నుంచి యెస్ బ్యాంక్ పోస్ట్ చేసింది. గత మూడు రోజులుగా బ్యాంకు కస్టమర్లు.. నగదు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురర్కొంటున్నారు. యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఆర్బీఐ యెస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ.. విత్‌డ్రాలపై రూ.50వేల వరకు మాత్రమే విధించడంతో ఈ సమస్యలు తలెత్తాయి.