Update : మీ కార్డుల్లో మార్చి 16లోగా ఈ సేవలను వాడండి..!
Update :ఇంతకు ముందు మేము “Alert..!మీ దగ్గర ఉన్న ఈ కార్డులు మార్చి 16లోగా వాడకపోతే అంతే సంగతి..!” అనే శీర్షికతో ఓ ఆర్టికల్ రాశాం. అందులో మార్చి 16లోగా డెబిట్/క్రెడిట్ కార్డులు వాడకపోతే పనిచేయవని పేర్కొన్నాము. అయితే ఆర్బీఐ తెలిపిన ప్రకారం అలా తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపింది. అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ కూడా చేయలేదని స్పష్టం చేసింది. అయితే ఆ తేదీ వరకు సదరు కార్డు వినియోగదారులు మార్చి16 నాటికి ఒక్కసారైనా ఇంటర్నేషనల్, […]
Update :ఇంతకు ముందు మేము “Alert..!మీ దగ్గర ఉన్న ఈ కార్డులు మార్చి 16లోగా వాడకపోతే అంతే సంగతి..!” అనే శీర్షికతో ఓ ఆర్టికల్ రాశాం. అందులో మార్చి 16లోగా డెబిట్/క్రెడిట్ కార్డులు వాడకపోతే పనిచేయవని పేర్కొన్నాము. అయితే ఆర్బీఐ తెలిపిన ప్రకారం అలా తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపింది. అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ కూడా చేయలేదని స్పష్టం చేసింది. అయితే ఆ తేదీ వరకు సదరు కార్డు వినియోగదారులు మార్చి16 నాటికి ఒక్కసారైనా ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లు చేయకపోయి ఉంటే.. దానికి సంబంధించిన సర్వీసులు మాత్రమే నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పాఠకుల దృష్టికి తీసుకోస్తున్నాము. ముందు తెలిపిన ప్రకారం మార్చి 16లోగా ట్రాన్సాక్షన్స్ చేయని కార్డులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తున్నాము.
ప్రస్తుతం డెబిట్/క్రెడిట్ కార్డుల వాడకం ఎంత పెరిగిందో చెప్పక్కర్లేదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో.. ఒకప్పటి కంటే ఇప్పుడు దాదాపు మూడింతులు వీటి వాడకం పెరిగింది. దీంతో క్రైం కూడా బాగా పెరిగింది. ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించే సమయంలో కార్డుల నంబర్లు దుర్వినియోగం అవుతున్న సమయంలో.. వినియోగదారులు మోసపోతున్నారు. దీంతో ఆర్బీఐ వినియోగదారుల కోసం.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ.. కార్డుల సెక్యూరిటీ విషయంలో బ్యాంకులను అలర్ట్ చేస్తోంది.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఒక్కసారైనా ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ల కోసం యూజ్ చేయకపోతే మార్చి 16 నుండి ఆ కార్డు పై ఉన్న ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే మిగిలిన సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.
కాగా.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్/క్రెడిట్ కార్డులు పనిచేస్తాయి. ప్రతి ఏటా ఈ కార్డులతో ట్రాన్సాక్షన్స్ పెరుగుతుండటంతో.. ఈ సర్వీసుల్లో ఎలాంటి మోసాలు జరగకుండా.. ఎప్పటికప్పుడు ఆర్బీఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది.