AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhakrishnan S.Damani: ప్రపంచ కుబేరులలో చోటు సంపాదించిన డీ మార్ట్ అధినేత.. 1.42 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో 98వ ర్యాంక్‌

Radhakrishnan S.Damani: డీ మార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్‌ ఎస్‌.దమానీ తొలిసారిగా ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌

Radhakrishnan S.Damani: ప్రపంచ కుబేరులలో చోటు సంపాదించిన డీ మార్ట్ అధినేత.. 1.42 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో 98వ ర్యాంక్‌
Radhakishan Damani
uppula Raju
|

Updated on: Aug 20, 2021 | 6:00 AM

Share

Radhakrishnan S.Damani: డీ మార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్‌ ఎస్‌.దమానీ తొలిసారిగా ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. 19.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా ఈ జాబితాలో చేరారు. దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గౌరవ చైర్మన్‌ శివ నాడార్, స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిట్టల్‌ సైతం నిలిచారు.

డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. నిజానికి స్టాక్‌ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్‌ కంపెనీలలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు.

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో 1954 మార్చి 15న పుట్టారు రాధాకిషన్. వ్యాపారాల మీద ఆసక్తితో ఆయన మొదట బాల్ బేరింగ్ వ్యాపారం ప్రారంభించారు. ఆయన తండ్రి మరణించడంతో ఆ వ్యాపారాన్ని వదిలేసి స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు. మొదటగా స్టాక్ మార్కెట్ లో రాధాకిషన్ చిన్న షేర్లు కొనడం..అమ్మడం చేస్తూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో (1990 ప్రాంతంలో) స్టాక్ మార్కెట్లను కుదిపేసిన హర్షద్ మెహతా దెబ్బతో చిన్న ఇన్వెస్టర్లు కుదేలు అయిపోయారు. అయినా, రాధాకిషన్ తన తెలివితేటలతో నిలదొక్కుకున్నారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో 1995 ముందువరకూ ఈయన అతి పెద్ద షేర్ హోల్డర్ గా ఉండేవారని చెబుతారు. హర్షద్ మెహతా స్కామ్ గొడవ సర్దుమణిగాకా 1992 లో రాధాకిషన్ స్టాక్ మార్కెట్ వ్యాపారం లాభాల్లో దూసుకు పోయింది.

Karvy MD Arrest: కార్వీ ఎండీ పార్థసారధిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… సుమారు రూ. 700 కోట్లకుపైగా రుణాలు ఎగవేశారంటూ..

70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

Zero Rupee Note: మనదేశంలో జీరో రూపీ నోట్ ఉందని తెలుసా.. ఈ నోటు ఎక్కడ దొరుకుంటుంది.. ఎలా వాడాలంటే..