Cyber Fraud: మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..

మారిన కాలంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రుణాలు పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇంట్లో కూర్చొనే మొబైల్‌ యాప్‌లో ఒక చిన్న క్లిక్‌ ద్వారా లోన్ పొందే అవకాశం లభించింది. దీన్నే ఆసరగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇంతకీ ఈ స్కామ్‌ ఎలా జరుగుతుంది..?

Cyber Fraud: మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
Cyber Fraud
Follow us

|

Updated on: Jul 23, 2024 | 10:07 AM

సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల ఆశలను, అవసరాలను ఆసరగా చేసుకొని ప్రజల డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి నేరాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేటుగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు.

మారిన కాలంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రుణాలు పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇంట్లో కూర్చొనే మొబైల్‌ యాప్‌లో ఒక చిన్న క్లిక్‌ ద్వారా లోన్ పొందే అవకాశం లభించింది. దీన్నే ఆసరగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇంతకీ ఈ స్కామ్‌ ఎలా జరుగుతుంది..? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా లోన్‌ కావాలనుకునే వారు ఏదో ఒక వెబ్‌సైట్‌లో తమ ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుంటారు. దీంతో పలు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. మీకు ప్రీ అప్రూవ్డ్‌ లోన్‌ లభించింది అంటూ మెసేజ్‌లు వస్తాయి. అందలోనే ఒక లింక్‌ను కూడా ఇస్తారు. ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేకుండానే లోన్‌ పొందొచ్చనేది సదరు మెసేజ్‌ సారాంశం. ఇక లింక్‌ క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్‌, పాన్‌ కార్డ్‌ వంటి వ్యక్తిగత వివరాలు అడుగుతారు.

ఒకవేళ పొరపాటున ఆ మెసేజ్‌ను నమ్మి అన్ని వివరాలు ఎంటర్ చేశారో ఇక మీ పని అంతే. వెంటనే మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని కనుక వారు తెలిపిన విధంగా ఎంటర్‌ చేస్తే. మీ ఖాతాలోని డబ్బులన్నీ అవతలి వారి ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. పర్సనల్‌ లోన్‌ పేరుతో జరుగుతోన్న ఈ మోసం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పేరున్న బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్‌లకే స్పందించాలి. ముఖ్యంగా ఊరుపేరు లేని బ్యాంకుల నుంచి ప్రీ అప్రూవ్డ్‌ పేరుతో వచ్చే మెసేజ్‌ల జోలికి వెళ్లకపోవడమే బెటర్‌. అలాగే ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని ఎంటర్‌ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?