Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ క్రిప్టోగ్రఫీపై ఆధారపడి ఉంటుంది.. అది ఎక్కడికీ పోదు..

క్రిప్టోకరెన్సీ గురించి చాలా సానుకూలంగా ఉన్నానని Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పాడు. ఇది ప్రాథమికంగా క్రిప్టోగ్రఫీపై ఆధారపడింది ఉంటుందని, ఎక్కడికి పోదని తెలిపారు.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ క్రిప్టోగ్రఫీపై ఆధారపడి ఉంటుంది.. అది ఎక్కడికీ పోదు..
Sharma
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 26, 2021 | 10:03 AM

క్రిప్టోకరెన్సీ గురించి చాలా సానుకూలంగా ఉన్నానని Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పాడు. ఇది ప్రాథమికంగా క్రిప్టోగ్రఫీపై ఆధారపడింది ఉంటుందని, ఎక్కడికి పోదని తెలిపారు. నవంబర్ 29 నుంచి పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో Paytm వ్యవస్థాపకుడి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ బిల్లు భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతోంది. అయితే క్రిప్టోకరెన్సీ యొక్క అంతర్లీన సాంకేతికతను, దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులను అనుమతిస్తుందని ప్రభుత్వం లోక్‌సభ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ బిల్లు “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం” కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

“నేను క్రిప్టో గురించి చాలా సానుకూలంగా ఉన్నాను. ఇది ప్రాథమికంగా క్రిప్టోగ్రఫీపై ఆధారపడి ఉంటుంది. ” అని చెప్పాడు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీల వాడకంపై నిర్దిష్ట నిబంధనలు లేదా నిషేధం ఏవీ లేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారం సీనియర్ అధికారులతో క్రిప్టోకరెన్సీలపై సమావేశం నిర్వహించారు. సమస్యను పరిష్కరించడానికి బలమైన నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని సూచనలు చేశారు. ఇప్పుడు ఊహాజనిత పద్ధతిలో వాడుతున్నారని శర్మ అన్నారు.

క్రిప్టో లేకుండా ప్రపంచం ఎలా ఉందో ప్రజలు గ్రహిస్తారని. అయితే ఇది సార్వభౌమ కరెన్సీకి ప్రత్యామ్నాయం కాదని ఆయన పేర్కొన్నారు. Paytm యొక్క ఆదాయం ఒక బిలియన్ USD దాటిన తర్వాత, దానిని అభివృద్ధి చెందిన దేశాలకు తీసుకువెళతామని శర్మ చెప్పారు. “ఇప్పుడు జపనీస్ సంస్థతో కూడిన JVలో Paytm జపాన్ యొక్క అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థను నడుపుతోంది. తర్వాత మేము భాగస్వామి లేకుండా వెళ్తాము,” అని అతను చెప్పాడు. భారతీయ పెట్టుబడిదారుల కంటే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతీయ సంస్థలపై మంచి అవగాహన ఉందని శర్మ పేర్కొన్నారు.

Read Also.. Saudi Arabia: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సౌదీ అరేబియా.. కానీ ఆ ఐదు రోజులు..