AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Payment: క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా చేయండి

Credit Card Payment: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు అనేది చాలా మంది వాడుతుంటారు. క్రెడిట్‌ కార్డుల వల్ల లాభాలు ఉంటాయి.. నష్టాలు ఉంటాయి. క్రెడిట్‌ కార్డుల....

Credit Card Payment: క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా చేయండి
Credit Card Payment
Subhash Goud
| Edited By: |

Updated on: Apr 17, 2021 | 8:37 AM

Share

Credit Card Payment: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు అనేది చాలా మంది వాడుతుంటారు. క్రెడిట్‌ కార్డుల వల్ల లాభాలు ఉంటాయి.. నష్టాలు ఉంటాయి. క్రెడిట్‌ కార్డుల వినియోగం రోజురోజుకు ఎక్కువవుతోంది. అయితే క్రెడిట్‌ కార్డుల ఉపయోగించే విధానం తెలిస్తే చాలా ప్రయోజనాలున్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్స్‌, వ్డడీ రేట్లు, ఆలస్య రుసుము ఇలా ప్రతీ ఒక్కటి తెలిస్తే నెలవారీ బడ్జెట్‌ మీద అదనపు భారం పడకుండా చేసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్‌ కార్డు బకాయిల మీద క్రెడిట్‌ కార్డ్‌ వినియోగాన్ని బట్టి పెద్ద మొత్తంలో వడ్డీ కింద కంపెనీలు చార్జ్‌ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే రుసుము కింద వెయ్యికిపైగా వసూలు చేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు బిల్లులను సకాలంలో చెల్లించని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్‌ కార్డు తిరిగి చెల్లింపు కాల వ్యవధి సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది.

వడ్డీ లేకుండా ఈఎంఐ ఆప్షన్స్‌..

అయితే కొన్ని సార్లు ఎటువంటి వడ్డీ లేకుండానే ఈఎంఐ చెల్లించండి అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్‌ ఈఎంఐ ఆప్షన్‌లో ఒక రకమే నో కాస్ట్‌ ఈఎంఐ స్కీమ్‌. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్‌టీని క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇక మంచి సిబిల్‌ స్కోర్‌, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్‌ కార్డులపై రుణాలను తీసుకోవచ్చు. అయితే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్‌ కార్డు లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్‌ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది.

ఇవీ చదవండి: Broadband Plans: పెరిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..అధిక స్పీడుతో ఇంటర్నెట్‌ సేవలు… ఏ నెట్‌వర్క్‌కు ఎంత ప్యాకేజీ..

Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!

Provident Fund: మీరు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఈ పని చేయండి… లేకపోతే మీ పీఎఫ్‌ డబ్బులకు ఇబ్బందులు

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ
వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ