Cognizant: ఆ జీతం వాళ్లది కాదు.. ఫ్రెషర్స్‌ ప్యాకేజీ వార్తలపై స్పందించిన కాగ్నిజెంట్‌

అయితే సోషల్‌ మీడియాలో ఈ చర్చ ఎంతకీ తగ్గకపోవడంతో కాగ్నిజెంట్ స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారానికి సంబంధించిన ప్యాకేజీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించింది కాదని, అది సాధారణ డిగ్రీ హోల్డర్‌లకు మాత్రమేనని తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతోన్న ఇంజనీరింగ్...

Cognizant: ఆ జీతం వాళ్లది కాదు.. ఫ్రెషర్స్‌ ప్యాకేజీ వార్తలపై స్పందించిన కాగ్నిజెంట్‌
Cognizant
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 19, 2024 | 7:06 AM

అమెరికాకు చెందిన ప్రముఖ ఐపటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవల పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ ఏడాదికి కేవలం రూ. 2.52 లక్షల జీతం ఆఫర్‌ చేసిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కాగ్నిజెంట్ సంస్థపై పలువురు విమర్శిస్తూ పోస్టులు చేశారు. ఒక ఐటీ ఉద్యోగికి మరీ ఇంత తక్కువ జీతం ఏంటంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్‌ చేశారు.

అయితే సోషల్‌ మీడియాలో ఈ చర్చ ఎంతకీ తగ్గకపోవడంతో కాగ్నిజెంట్ స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారానికి సంబంధించిన ప్యాకేజీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు సంబంధించింది కాదని, అది సాధారణ డిగ్రీ హోల్డర్‌లకు మాత్రమేనని తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతోన్న ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారికి తాము ప్రారంభ వేతనంగా రూ. 4 నుంచి రూ. 12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే ఇక్రిమెంట్స్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై కూడా స్పందించారు.

తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కేవలం 1 శాతం హైక్‌ మాత్రమే ఇస్తున్నారని సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్‌పై కూడా కాగ్నిజెంట్ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్‌ అని వివరించింది. తమ సంస్థ ప్రతీ ఏటా ఇంజనీరింగ్‌, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్‌ ఫ్రెషర్‌లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటోంది. ఈ రెండు రిక్రూట్‌మెంట్‌లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్‌ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్‌ల శాలరీ ప్యాకేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయని కాగ్నిజెంట్ అమెరికాస్‌ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు.

ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. నాన్‌ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన తమ జాబ్‌ పోస్టింగ్‌పై ట్రోలింగ్స్‌ వచ్చాయని తెలిపారు. రూ. 2.52 లక్షల వార్షిక వేతనం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ స్పష్టతోనైనా నెట్టింట జరుగుతోన్న ట్రోలింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..