CNG Gas Prices: వినియోగదారులకు మరో షాక్.. పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు.. ఎప్పటి నుంచంటే?

దేశ రాజధాని ఢిల్లీలో CNG గ్యాస్ ధర మరోసారి భగ్గమందీ. ఇప్పటికే పెట్రోల్, డిజీల్ వాతలను జనం తేరుకోకముందే.. తాజాగా ఢిల్లీలో CNG గ్యాస్ ధరలు పెరిగాయి.

CNG Gas Prices: వినియోగదారులకు మరో షాక్.. పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు.. ఎప్పటి నుంచంటే?
Cng Gas
Follow us

|

Updated on: Mar 24, 2022 | 10:24 AM

CNG Gas Prices:  దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో CNG గ్యాస్ ధర మరోసారి భగ్గమందీ. ఇప్పటికే పెట్రోల్, డిజీల్(Petrol-Diesel) వాతలను జనం తేరుకోకముందే.. తాజాగా ఢిల్లీ ప్రజలు CNG గ్యాస్ కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో నేటి నుంచి సీఎన్‌జీ ధర 50 పైసలు పెరిగింది. నేటి నుండి, CNG కోసం రూ. 59.01 బదులుగా, ప్రజలు ఇప్పుడు రూ. 59.51 చెల్లించవలసి ఉంటుంది. ఇక నుంచి వాహనదారులకు మరింత భారం కానుంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ పెరుగుతున్న ధరలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు.పెరిగిన ధరలన్నింటినీ ఉదహరిస్తూ ఉదయాన్నే ‘ద్రవ్యోల్బణం ఉదయం’ అని అభివర్ణించారు. ఇకపై ఇంటి గ్యాస్‌తో పాటు ఆటో, ట్యాక్సీ, బస్సు ఛార్జీలు కూడా పెరుగుతాయని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరను పెంచింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో, స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పిఎన్‌జిని రూ.1 పెంచారు. ఆ తర్వాత పిఎన్‌జి ఇక్కడ యూనిట్‌కు రూ. 36.61కి అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు నేటి నుండే అంటే మార్చి 24, 2022 నుండి అమలులోకి వచ్చాయి. మార్చి 22వ తేదీన డొమెస్టిక్ ఎల్‌పిజి ధర కూడా సిలిండర్‌కు రూ.50 పెంచడంతో ప్రజల వంటగది బడ్జెట్ ఖరీదైంది. ఇప్పుడు పిఎన్‌జి ధర పెరగడం వల్ల దానిని ఉపయోగించే వారికి వంట ఖర్చు కూడా పెరుగుతుంది.

ఏ ప్రాంతంలో PNG కొత్త ధరలు ఏమిటో తెలుసుకోండి:

  1. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ SCMకి రూ. 35.86
  2. కర్నాల్, రేవారీ ఒక్కో SCMకి రూ. 35.42
  3. గురుగ్రామ్ ఒక్కో SCMకి రూ. 34.81
  4. ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ ఒక్కో SCMకి రూ. 39.37
  5. అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్ ఒక్కో SCMకి రూ. 42.023
  6. కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేపూర్ ఒక్కో SCMకి రూ. 38.50

ఇదిలావుంటే, మార్చి 22న గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెరిగిన తర్వాత ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.949.50కి పెరిగింది. కోల్‌కతాలో, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ. 976 చొప్పున అందుబాటులో ఉంటుంది. చెన్నైలో, సిలిండర్‌కు రూ. 965.50 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సిలిండర్ ధర రూ.987.50 పెరిగింది.

మరోవైపు, వరుసగా రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, కానీ నేడు వాటి ధరలు పెరగలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నిన్నటి స్థాయిలోనే కొనసాగించాయి. ఢిల్లీలో, నేడు రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర నిన్నటి స్థాయిలలో ఉంది. లీటరుకు రూ. 97.01 వద్ద ఉంది. నేడు ఢిల్లీలో డీజిల్ లీటరుకు రూ. 88.27 వద్ద అందుబాటులో ఉంది. అదే సమయంలో, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.67 మరియు డీజిల్ ధర రూ. 95.85. Read Also….

Petrol Price Today: రెండు రోజుల తర్వాత వాహనదారులకు ఉపశమనం.. స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..